Kalki 2898AD Collections : సినిమా అంటే పడిచచ్చేవాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఆంధ్రా.. నైజాం, సీడెడ్ ఏరియాల కంటే ఆంధ్రాలోనే థియేటర్ల సంఖ్య ఎక్కువ. అయితే ఆరేళ్లుగా ఆంధ్రా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు వసూలు చేసిన ‘RRR’ మూవీ కూడా ఆంధ్రాలో పెద్దగా లాభాలు తీసుకురాలేకపోయింది.. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయమే.. అలాగే ‘దసరా’, ‘సలార్’, ‘భగవంత్ కేసరి’, ‘పుష్ప’ వంటి సినిమాలు ఆంధ్రాలో భారీ నష్టాలను చవి చూశాయి..
Kalki 2898AD Movie Twist : గాంఢీవం ఎత్తిన సుప్రీమ్ యాస్కిన్, అర్జునుడి రూపమా? ఇదేం ట్విస్టురా బాబూ..
నైజాంలో సూపర్ హిట్టైన ‘దసరా’ మూవీకి, ఏపీలో భారీ నష్టాలు వచ్చాయి. ‘పుష్ప’ సినిమాకి ఆంధ్రాలో రూ.10 కోట్ల నష్టాలు వచ్చాయి. వైసీపీ ఓటమితో మళ్లీ ఆంధ్రాలో సినిమాలకు మంచి రోజులు వస్తాయని అనుకున్నారు. ‘కల్కి 2898AD’ మూవీకి మంచి హైక్ దక్కింది. అయితే 11 రోజులు ముగిసే సమయానికి నైజాం, ఓవర్‌సీస్ ఏరియాల్లో ‘కల్కి 2898AD’ మూవీకి మంచి లాభాలు వచ్చాయి. అయితే సీడెడ్, ఏపీ ఏరియాల్లో మాత్రం ఇంకా నష్టాల్లోనే ఉంది ‘కల్కి 2898AD’ మూవీ..
Kalki 2898 AD Vs Mad Max : కల్కి చూడాలి అనుకునే వాళ్ళు, ఇది చదవకండి..
ఆంధ్రాలో ఇప్పటిదాకా 70 శాతం మాత్రమే రికవరీ అయ్యింది. సీడెడ్‌లో 80 శాతం దాకా తిరిగి వసూలు చేయగలిగింది. నైజాంలో 5 రోజుల్లోనే లాభాలు రాగా, ఆంధ్రాలో మాత్రం పరిస్థితి ఎందుకు ఇలా మారిందో ట్రేడ్ పండితులకు కూడా అర్థం కావడం లేదు. ఫుల్ రన్‌లో అయినా ‘కల్కి 2898AD’ మూవీ, ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ దాటుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది..