Revanth Reddy : 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం… ఆరు గ్యారెంటీలు అంటూ చేసిన ప్రచారం బాగా కలిసి రావడంతో రూరల్‌లో కాంగ్రెస్‌కి భారీగా సీట్లు దక్కాయి. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ విషయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగితే, ‘జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం..’ అని చెప్పారు. కానీ గులాబ్ జామున్‌లో గులాబీ లేనట్టే, జాబ్ క్యాలెండర్‌లో జాబులు లేవు. ఈ విషయంపై ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది గ్రూప్ 2 అభ్యర్థి సింధు.. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ మీడియా ముందు ఫైర్ అయ్యింది.
Lok Sabha session : లోక్ సభలో నీట్ రగడ..
దీంతో సింధుపై సోషల్ మీడియాపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. వీటిపైన రియాక్ట్ అయ్యింది సింధు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తీన్మార్ మల్లనపై విరుచుకుపడింది..
‘ఎన్నికల ముందు నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే, నన్ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండింల్స్‌లో నన్ను పెయిడ్ ఆర్టిస్టు అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ బాధ్యతాయుత పొజిషన్‌లో ఉండి తీన్మార్ మల్లన్న, నన్నుశంకిని అంటున్నారు..
గతంలో బీఆర్‌ఎస్ చేసిన తప్పుల మీద మాట్లాడినప్పుడు నేను ఇలా కనిపించలేదా? వాళ్లు జాబ్‌లు ఇవ్వలేదనే కదా, మీకు ఓటు వేసి ఎన్నుకున్నాం.. అప్పుడు కాంగ్రెస్ వాళ్లు, నాకు డబ్బులు ఇవ్వడం వల్లే అలా మాట్లాడానా? నేను ఏ పార్టీ కండువా కప్పుకోలేదు. అలా ఎవ్వరైనా నిరూపించండి చూద్దాం..
ఎట్లుండే తెలంగాణ అంటూ చేసిన ప్రచారమే బీఆర్‌ఎస్‌ని ముంచిందా..!?
బతుకు తెరువు కోసం పోరాడుతున్న ఓ ఆడబిడ్డని పట్టుకుని, ఇలా పెయిడ్ ఆర్టిస్ట్ అనడం ఎంత వరకూ కరెక్ట్… నిరుద్యోగులను మోసం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చూసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూస్తుంది.. ’ అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యింది సింధు..