Documentary on Rajamouli : టాలీవుడ్ దర్శకుడికి అరుదైన గౌరవం..

Documentary on Rajamouli
Documentary on Rajamouli

Documentary on Rajamouli : ‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. హాలీవుడ్‌లో మాత్రమే కాదు, టాలీవుడ్‌లోనూ రూ.1000 కోట్లు వసూలు చేసే సినిమాలు తీయగలమని నిరూపించిన దర్శకుడాయన.. ‘RRR’ సినిమాతో టాలీవుడ్‌ని ఆస్కార్స్‌లో నిలబెట్టిన రాజమౌళిపైన ఓ డాక్యుమెంటరీ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్..

‘మోడ్రన్ మాస్టర్స్: ఎస్. ఎస్. రాజమౌళి’ పేరుతో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి బ్యాక్ గ్రౌండ్, ఆయన తీసిన మాస్టర్ పీసెస్, ‘ఈగ’, ‘మగధీర’, ‘బాహుబలి’, ‘RRR’ వంటి సినిమా విశేషాలను పంచుకోబోతున్నారు. అప్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఫిల్మ్ కంపెనియర్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా ఈ డాక్యుమెంటరీని నిర్మిస్తున్నారు. రాఘవ్ ఖన్నా దర్శకత్వంలో ఈ డాక్యుమెంటరీ రూపొందుతోంది..

RGV – Mani Ratnam : ఆ రెండు సినిమాల కోసం కలిసి పనిచేసిన ఆర్జీవీ – మణిరత్నం.. ఎలా విడిపోయారు..

ఈ డాక్యుమెంటరీలో హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కామెరూన్, జో రుస్సో కూడా రాజమౌళి టేకింగ్ గురించి తమ అభిప్రాయాలను పంచుకోబోతున్నారు. అలాగే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ హీరోలు ప్రభాస్, రానా దగ్గుబాటి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తారు. ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2న Netflix యాప్‌లో విడుదల కానుంది

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post