Kalki 2898AD Movie Box Office : పోయినచోటే వెతకాలనేది ఓ సామెత. ఇదే వ్యాపారంలో ఓ సూత్రం కూడా.. వ్యాపారంలో పోయిన చోట, తిరిగి సంపాదించడం చాలా కష్టం. అయితే సుజిత్, ఓం రౌత్, రాధాకృష్ణ, ప్రశాంత్ నీల్ పోగొట్టిన చోట.. ప్రభాస్ ఇమేజ్‌ని, బ్రాండ్ మార్కెట్‌ని తిరిగి నిర్మించి చూపించాడు నాగ్ అశ్విన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన ‘సలార్’ సినిమాకి నైజాంలో మంచి లాభాలు వచ్చాయి. అయితే ఆంధ్రా, ఓవర్సీస్ ఏరియాల్లో నష్టాలు తప్పలేదు.
ఈ సినిమాని నార్త్ అమెరికాలో 15 మిలియన్ డాలర్లకు అమ్మారు. అయితే మొత్తంగా ఈ మూవీ కలెక్షన్లు 12 మిలియన్ల దగ్గరే ఆగిపోయాయి. ‘సలార్’ మూవీ కారణంగా ‘కల్కి 2898AD’ సినిమాని నార్త్ అమెరికాలో 12 మిలియన్ డాలర్లకే అమ్మాయి. మొదటి 6 రోజుల్లోనే ఈ సినిమా నార్త్ అమెరికాలో దాదాపు 19 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే ఈ సినిమాకి లాభాలు రావడమే కాదు, ‘సలార్’ ద్వారా బయ్యర్లు కోల్పోయిన డబ్బు కూడా ‘కల్కి 2898AD’ ద్వారా తిరిగి వచ్చేసింది..
Kalki 2898AD Movie Story : ధర్మరాజు ఆడిన చిన్న అబద్ధమే, ‘కల్కి 2898AD’ స్టోరీకి మూలం!
ఓవర్సీస్ వసూళ్లలో ఇప్పటికే రూ.200 కోట్ల మార్కు దాటేసిన ‘కల్కి 2898AD’, ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రభాస్ కెరీర్లో ఇది మూడో రూ.600 కోట్ల సినిమా. ‘బాహుబలి 2’ తర్వాత, ‘సలార్’ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.720 కోట్ల దాకా వసూలు చేసింది. అయితే భారీ ధరలకు అమ్మడంతో ‘సలార్’ బయ్యర్లకు కొన్ని ఏరియాల్లో నష్టాలు మిగిల్చింది. అందుకే ‘కల్కి 2898AD’సినిమా థియేట్రికల్ రైట్స్‌ని రూ.385 కోట్లకే విక్రయించారు.. రిటర్న్ బాగుండడంతో తొలి వారంలోనే లాభాల్లోకి వచ్చే దిశగా పరుగులు తీస్తోంది..