Ind vs Aus Final : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసింది. అహ్మదాబాద్‌లో భారీ అంచనాలతో ఫైనల్ ఆడిన భారత జట్టు, మరోసారి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
ఎన్నాళ్లు, ఇంకెన్నాళ్లు! ఫైనల్ అనేసరికి వణికిపోతున్న భారత బ్యాటర్లు… వరల్డ్ కప్ ఫైనల్‌లో..
భారత బ్యాటర్లు ‘అతి జాగ్రత్త’ గా ఆడుతూ బౌండరీలు బాదడమే రాద్దన్నట్టుగా ఆడారు. 107 బంతులు ఆడిన కెఎల్ రాహుల్ ఒకే ఒక్క ఫోర్ బాదితే, 11వ ఓవర్ తర్వాత 40 ఓవర్లలో భారత బ్యాటర్లు కేవలం నాలుగు ఫోర్లు మాత్రమే బాదారు. అందులో సిరాజ్, షమీ ఒక్కో ఫోర్ బాదారంటే భారత టాపార్డర్, మిడిల్ ఆర్డర్ ఎంత జిడ్డు బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.
241 పరుగుల లక్ష్యఛేదనలో 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. దీంతో మనోళ్లు మ్యాజిక్ చేస్తారని, టీమిండియాకి మూడో టైటిల్ దక్కుతుందని ఆశపడ్డారంతా. అయితే ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగడంతో ఫైనల్ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది.
పవన్ కళ్యాణ్, నాని, కార్తీ.. ఆ హీరోలకి కలిసి రాని 25వ చిత్రాలు..
లీగ్ స్టేజీలో వర్కవుట్ అయినా బౌలింగ్ లైనప్‌ని కాస్త అటు ఇటుగా మార్చిన కెప్టెన్ రోహిత్ శర్మ… అనుకున్న రిజల్ట్ రాబట్టలేకపోయాడు. ఆస్ట్రేలియా మెరుపు ఫీల్డింగ్‌తో భారత బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి పెంచడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. భారత ఫీల్డర్లు మాత్రం చేతుల దాకా వస్తే కానీ ఆపడం తమ బాధ్యత కాదన్నట్టుగా ఫీల్డింగ్ చేయడం.. భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం..