Ram Charan : నిర్మాతగా గ్లోబల్ స్టార్..

Ram Charan
Ram Charan _ Nikhil

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిర్మాతగా మారుతున్నాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి రెండు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. బాబాయి నాగబాబు నిర్మాతగా ‘అంజనా ప్రొడక్షన్స్’ బ్యానర్ ఉంటే, తండ్రిని హీరోగా పునఃపరిచయం చేస్తూ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ నెలకొల్పాడు రామ్ చరణ్. తాజాగా అభిషేక్ అగర్వాల్‌తో కలిసి ‘వీ మెగా పిక్చర్స్’ అనే మరో బ్యానర్ స్థాపించాడు రామ్ చరణ్..

రామ్ చరణ్, అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా నిఖిల్ సిద్ధార్థతో ఓ పాన్ ఇండియా మూవీని నిర్మించబోతున్నారు. ‘కార్తికేయ 2’ సినిమాతో నిఖిల్‌కి పాన్ ఇండియా లెవెల్‌లో మార్కెట్ వచ్చింది. ప్రస్తుతం ‘స్వయంభు’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు నిఖిల్. ఈ సినిమా తర్వాత ‘ది ఇండియా హౌస్’ అనే మరో పాన్ ఇండియా మూవీకి సైన్ చేశాడు. ఈ మూవీకి అభిషేక్ అగర్వాల్, రామ్ చరణ్ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు..

Beautiful Female Cricketers : ప్రపంచంలోనే అందమైన మహిళా క్రికెటర్లు వీరే..

సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించే ‘ది ఇండియా హౌస్’ సినిమాలో అనుపమ్ ఖేర్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తారు. కొత్త దర్శకుడు రామ్ వంశీ కృష్ణ, ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నాడు. హంపిలోని విరూపాక్ష ఆలయంలో ఈ సినిమా ప్రారంభోత్సవం శాస్త్రోత్తం జరిగింది..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post