Actress Trisha responds to Mansoor Ali Khan’s derogatory comments : సినిమాల్లో క్రూరమైన పాత్రల్లో నటించే నటుడు మన్సూర్ ఆలీ ఖాన్, హీరోయిన్ త్రిషపై చేసిన కామెంట్లు కోలీవుడ్లో పెను దుమారం రేపాయి. ‘‘నేను చాలా టెంప్ట్ అయ్యా. ‘లియో’ మూవీలో త్రిషతో ఓ బెడ్ రూమ్ సీన్ ఉంటుంది. ఆ సీన్లో నేను త్రిషను రేప్ చేయాలని అనుకున్నా…’’ అంటూ మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
చైయిన్ స్మోకర్ మహేష్, ఆ అలవాటు ఎలా మానేశాడు! ‘గుంటూరు కారం’ కోసం నిజంగానే..
ఈ వ్యాఖ్యలపై త్రిష స్పందించింది. ‘మన్సూర్ ఆలీ ఖాన్ నా గురించి అసభ్యకరంగా మాట్లాడిన వీడియో నేను చూశాను. ఇలా అసభ్యకరంగా, అమానవీయంగా, పురుషాహంకారంతో చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అతనికి ఎలాంటి కోరికలు అయినా ఉండొచ్చు.
ఇలాంటి వ్యక్తితో ఎప్పుడూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోకపోవడం నా అదృష్టం. ఇకపై నా ఫిల్మ్ కెరీర్లో ఎప్పుడూ అతనితో కలిసి నటించను. ఇలాంటి వ్యక్తుల వల్ల మనుషులకే చెడ్డ పేరు వస్తోంది..’ అంటూ ఇన్స్టాలో స్టోరీ పెట్టింది త్రిష.
Say No DP : సంస్కారం లేని టెక్నాలజీ..
‘లియో’ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కూడా ఈ దుమారంపై స్పందించాడు. ‘మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు విని చాలా నిరుత్సాహపడ్డాను. ఇలాంటి ప్రవర్తన అస్సలు సహించతగినది కాదు’ అంటూ ట్వీట్ చేశాడు లోకేశ్ కనగరాజ్.