Naga Shaurya – Darshan : కన్నడ హీరో దర్శన్‌కు నాగశౌర్య మద్దతు..

Naga Shaurya - Darshan
Naga Shaurya - Darshan

Naga Shaurya – Darshan : రేణుకా స్వామి అనే అభిమాని హత్యకేసులో అరెస్టు అయిన కన్నడ హీరో దర్శన్‌కి తెలుగు హీరో నాగశౌర్య మద్ధతుగా నిలిచాడు. పవిత్రా గౌడ అనే నటితో కన్నడ హీరో దర్శన్ చాలా రోజులుగా రిలేషన్‌లో ఉన్నాడు. పవిత్రా గౌడకి సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్న రేణుకా స్వామిని తన అభిమానులతో కలిసి కిడ్నాప్ చేయించిన దర్శన్, కిరాతకరంగా హత్య చేయించాడు..

రేణుకా స్వామిని అతి దారుణంగా కొట్టి, చిత్రహింసలు చేసి చంపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో దర్శన్‌ని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే నాగశౌర్య మాత్రం దర్శన్‌కి సపోర్ట్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది..

Kannada Actor Darshan : చెంపదెబ్బ కొట్టాను, చంపలేదు..

‘దర్శన్‌ గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఎవరికీ హానీ చేసే వ్యక్తి కాదు. వీలైతే సాయం చేస్తారు కానీ ఎవ్వరికీ హానీ చేయడు. ఎంతోమందికి సాయం చేశారు. ఆయన మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి కూడా. ఈ సంఘటనలో నిజానిజాలు బయటికి రావాలి. అంతవరకూ దర్శన్ కుటుంబానికి కాస్త గౌరవం ఇవ్వండి.. న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. నిజమైన దోషులు ఎవరో తేలాలి? వారికి శిక్ష పడాలి..’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు నాగశౌర్య..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post