Kalki 2898AD Movie Collections : ప్రభాస్ ఊచకోత!

Kalki 2898AD Movie Collections
Kalki 2898AD Movie Collections

Kalki 2898AD Movie Collections : ఇండియాలో బాక్సాఫీస్ రికార్డులన్నీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సినిమాల మీదే ఉంటాయి. ‘మగధీర’ మూవీ నుంచి బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ వస్తున్నాడు జక్కన్న. అయితే తొలిసారి రాజమౌళి తీసిన సినిమా కాకుండా జక్కన్న నటించిన సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898AD మూవీ, మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.190 కోట్లు రాబట్టింది.

Deepika Padukone : ‘కల్కి’కి ప్రాణం పోసిన దీపికా.. ఫిదా అవుతున్న జనాలు..

నార్త్ అమెరికాలో తొలి రోజు రూ.52 కోట్లు (6 మిలియన్ డాలర్లకు పైగా) రాబట్టింది కల్కి 2898AD. తెలంగాణ ఏరియాలో రూ.25 కోట్లకు పైగా గ్రాస్, రూ.19.5 కోట్ల షేర్ వచ్చింది. ఆంధ్రాలో కూడా చాలా ఏరియాల్లో ‘బాహుబలి 2’, ‘RRR’ సినిమాల రికార్డులు బ్రేక్ అయ్యాయి.

ఆంధ్రాలో కూడా కొన్ని జిల్లాల్లో రికార్డు లెవెల్ వసూళ్లు రాగా మాస్ ఏరియాల్లో మాత్రం ‘కల్కి 2898AD’ మూవీకి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ముఖ్యంగా సీడెడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో 9వ స్థానంలో నిలిచింది ‘కల్కి’ మూవీ. దీనికి ప్రధాన కారణం మాస్ జనాలకు ఈ మూవీ కనెక్ట్ కాకపోవడమే..

Kalki 2898AD Movie Review : బాహుబలి రేంజ్ హిట్టు కొట్టేసిన ప్రభాస్..

తొలిరోజు వచ్చిన పాజిటివ్ రివ్యూల కారణంగా రెండో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి.. రెండో రోజు ఈజీగా రూ.90 నుంచి రూ.110 కోట్ల వరకూ రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంచనా. రేపు, ఎల్లుండి ఈ కలెక్షన్లు మరింత పెరగబోతున్నాయి. వీకెండ్ ముగిసే సమయానికి రూ.300 కోట్ల నుంచి రూ.350 కోట్ల వరకూ రావచ్చని అంచనా..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post