Deepika Padukone : దీపికా పదుకొనే పుట్టింది సౌత్‌లోనే, కానీ స్టార్ హీరోయిన్‌గా మారింది మాత్రం నార్త్‌లో! దీపికా పదుకొనే యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ఓం శాంతి ఓం’ సినిమాతోనే తన యాక్టింగ్‌ని పరిచయం చేసింది దీపికా పదుకొనే. ఆ తర్వాత ‘తమాషా’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘పద్మావత్’, ‘భాజీరావు మస్తానీ’, ‘రామ్‌లీలా’ ఇలా ఎన్నో సినిమాలను తన యాక్టింగ్‌తోనే క్లాసిక్ గా నిలిపింది. ‘కల్కి 2898AD’ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ అనే సరికి, ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ సంతోషపడ్డారు.
Kalki 2898AD Movie Records : కొత్త టార్గెట్ సెట్ చేస్తున్న ప్రభాస్..
కానీ కొందరు మాత్రం భయపడ్డారు. దీపికా పదుకొనే తన యాక్టింగ్‌తో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఎక్కడ రెబల్ స్టార్‌ని డామినేట్ చేస్తోందోనని! ట్రైలర్‌లో తెలుగు పలకడానికి కష్టపడుతూ దీపికా పదుకొనే చెప్పిన డైలాగులపై ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే సినిమా రిలీజ్ అయ్యాక అంతా దీపికా ఫ్యాన్స్ అయిపోయారు..
‘కల్కి 2898AD’ సినిమాకి దీపికా పదుకొనే పర్ఫామెన్స్ కూడా ఓ బలం. కళ్లతోనే అభినయించగల దీపికా, మరోసారి తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసింది. దీపికా త్వరలో తల్లి కాబోతోంది. అందుకే ‘కల్కి’ మేకర్స్‌కి ఆమె మేకప్ అవసరం కూడా రాలేదు. గర్భవతిగా సహజంగానే అలా నటించింది. ఇప్పటి వరకు ఎవరు అలా చేయలేదేమో.. దీపికా పదుకొనే గురించి తెలియని వాళ్లు కూడా ఈ మూవీ చూశాక ఆమె డెడికేషన్‌కి, యాక్టింగ్‌కి ఫ్యాన్స్ అయిపోతారు.
Shruti Haasan Reply to Netizen: మీ నార్త్ బలుపు మీ దగ్గరే ఉంచుకోండి..
పక్కనే దిశా పటానీ (Disha Patani) లాంటి కుర్ర హీరోయిన్ తన గ్లామర్‌తో ఎంత ప్రయత్నించినా చేయలేనిది, దీపికా పదుకొనే డీ-గ్లామర్ రోల్‌లో చేసింది. ‘కల్కి 2898AD’ మూవీ దీపికాకి ప్లస్, అలాగే ఈ మూవీకి కూడా ఆమె చాలా పెద్ద ప్లస్.. వాడెవడో బాలీవుడ్ పండితుడు చెప్పినట్టుగా దీపికా పదుకొనే లక్ కూడా ‘కల్కి 2898AD’ మూవీని నెగిటివ్ రివ్యూల నుంచి కాపాడుతుందేమో..
Kalki 2898AD Movie Story : ధర్మరాజు ఆడిన చిన్న అబద్ధమే, ‘కల్కి 2898AD’ స్టోరీకి మూలం!