Kalki 2898AD Movie Review : ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత నటించిన ప్రతీ సినిమా బయ్యర్లకు అంతో ఇంతో నష్టాలు తెచ్చిపెట్టాయి. ప్రశాంత్ నీల్ తీసిన ‘సలార్’ మూవీకి రివ్యూలు బాగా వచ్చినా, లాభాలు మాత్రం రాలేదు. అయితే ‘కల్కి 2898AD’ మూవీ మాత్రం అంచనాలను విపరీతంగా పెంచేసింది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ వంటి వారు నటించడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను కల్కి అందుకోగలిగాడా?
తెలిసిన కథ, తెలియని వ్యథ..
మహాభారతం చదివిన వాళ్లకు కల్కి తెలిసిన కథే. తన తండ్రి భీష్ముడిని చంపిన పాండవులపై అశ్వత్థామ దొంగ దెబ్బ తీయడం, కృష్ణుడి శాపంతో చావు లేక, చీము నెత్తురుతో గుహాల్లో తలదాచుకుంటూ బతకడం.. ఇక్కడి నుంచే కల్కి మొదలవుతుంది. మహాభారత కురుక్షేత్ర యుద్ధం జరిగిన 5 వేల ఏళ్లకు సకల వైభోగాలు ఉన్న కాంప్లెక్స్‌లోకి వెళ్లాలనుకునే ఓ యువకుడు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ఎలాగైనా భూమి మీదకి తీసుకు రావాలనుకునే గర్భవతి అయిన ఓ యువతి.. ఆమెకు రక్షణగా మారే అశ్వత్థామ.. కల్కి 2898 AD సినిమా అంతా ఈ మూడు పాత్రల చుట్టూ ఎక్కువగా తిరుగుతుంది.
ఎలా ఉందంటే..
ఫస్టాఫ్ స్లోగా మొదలవుతుంది. అరగంట తర్వాతే హీరో ఎంట్రీ ఉంటుంది. ప్రభాస్ వచ్చిన తర్వాత ఊపు అందుకునే సినిమా, ప్రీ ఇంటర్వెల్ నుంచి తారా స్థాయికి చేరుకుంది. సెకండాఫ్‌లో పీక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఊహించని కెమియోలు, హాలీవుడ్ రేంజ్ విజువుల్స్, ఫైట్లు, సెట్టింగ్స్.. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులను ఓ కొత్తలోకంలోకి తీసుకెళ్తాయి.
Kalki 2898AD Movie Story : ధర్మరాజు ఆడిన చిన్న అబద్ధమే, ‘కల్కి 2898AD’ స్టోరీకి మూలం!
మేం ఇక్కడే ఉంటాం, అక్కడికి రాం.. అనుకునే మూస ధోరణి వదలని కొందరు మాస్ ఆడియెన్స్‌కి ఈ సినిమా ఎక్కదు. కానీ కొత్తదనం కోరుకునే అందరికీ కల్కి ఓ ఎపిక్ సినిమాయే..
టెక్నికల్‌గా ఎలా ఉంది..
‘మహానటి’ పేరుతో సావిత్రి బయోపిక్ తీసిన నాగ్ అశ్విన్, ఈసారి సైంటిఫిక్ యాక్షన్ మూవీని, మైథాలజీతో కలిపి ‘కల్కి 2898AD’ మూవీ తీశాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌కి, అతని ఊహాశక్తికి ఫిదా అవ్వాల్సిందే. సినిమా టెక్నికల్‌గా, నటీనటుల నటన పరంగా ఓ విజువల్ వండరే. సినిమాలో అందరూ తమ పాత్రల్లో అద్భుతంగా జీవించారు.
అయితే బలమైన డ్రామా, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో మాత్రం నాగ్ అశ్విన్ కాస్త తడబడ్డాడు. ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. చాలా సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెస్తాయి. సినిమాకి పెట్టే రూ.500 తగ్గ విజువుల్ వండర్‌ని స్క్రీన్ మీద చూపించాడు నాగ్ అశ్విన్. టాలీవుడ్‌లో కొత్త కథలు రావు అనుకునేవాళ్లకు నాగ్ అశ్విన్ అదిరిపోయే సమాధానం ఇచ్చేశాడు. ఇలాంటి సినిమాలను థియేటర్లలోనే చూడాలి. కాబట్టి అస్సలు మిస్ కావద్దు…
Kalki 2898AD: బాహుబలిని కొట్టే హాలీవుడ్ రేంజ్ సినిమా..