Traffic Rules and Regulations : ట్రాఫిక్ పోలీసులు బండి ఆపారా… ఈ విషయాలు తెలుసుకోండి..

Traffic rules and Regulations
Traffic rules and Regulations

Traffic Rules and Regulations : బండి తీసుకుని బైటికి వెళితే చాలు.. ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తే ఎక్కడో దడ మొదలవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్, హెల్మెట్, పొల్యూషన్ అన్నీ సరిగ్గా ఉన్నా సరే.. ట్రాఫిక్ పోలీసులు ఆపారంటే ఏదో ఒక కారణం చూపి ఫైన్ వేస్తారని భయపడతారు చాలామంది. అయితే ట్రాఫిక్ రూల్స్ గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు..

చాలామంది వెహికల్స్‌కి పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ చేయించరు. పోలీసులు కూడా లైసెన్స్, ఆర్‌సీకి ఇచ్చిన విలువ దీనికి ఇవ్వరు. అయితే నిజానికి పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేకపోతే రూ.10 వేల దాకా ఫైన్ వేసేందుకు అవకాశం ఉంది. అయితే మీ వెహికల్ నుంచి వచ్చే పొగ లిమిట్‌లో ఉంటే మాత్రం జరిమానా రూ.500 మాత్రమే పడుతుంది. కంట్రోల్ తప్పిందా అందుకు రూ. పది వేలు కట్టాల్సిందే.

సిగ్నల్ జంప్ చేసినందుకు సాధారణంగా రూ. వెయ్యి నుంచి రూ.5 వేల దాకా ఫైన్ వేస్తారు. అయితే నిజానికి ఇది మొదటిసారి మాత్రమే వేయాల్సిన ఫైన్. రెండోసారి కూడా సిగ్నల్ జంప్ చేస్తే మొదటి ఫైన్‌కు రెట్టింపు జరిమానా కట్టాల్సిందే.

Banglore News: వేడి భోజనం అందించనందుకు రెస్టారెంట్ కు ఫైన్..

సైలెన్సర్ లేకుండా వెహికల్ నడిపితే.. శబ్ధ కాలుష్యం చేస్తున్నందుకు రూ.500 నుంచి రూ.1500 దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
హై బీమ్ హెడ్‌లైట్స్ ఉన్న బండి నడిపితే రూ.500 జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే అదే అస్సలు హెడ్ లైట్సే లేని బండికి మాత్రం చట్టరీత్యా రూ.5 నుంచి రూ.15 జరిమానా మాత్రమే పడుతుంది.

కారులోపల స్మోకింగ్ చేస్తే రూ.500 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. కారులో డ్రైవర్ కాకుండా ప్రయాణికులు కూడా ఉంటే.. వారి ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తున్నందుకు ఈ ఫైన్ మరింత పెరుగుతుంది.
కొత్త నియమాల ప్రకారం టూ వీలర్‌పై ఇద్దరు ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. నాలుగేళ్ల కంటే పెద్ద వయసు పిల్లలున్నా వారికి హెల్మెట్ తప్పనిసరి. అంతేకాదు భార్యభర్తలతో పాటు నాలుగేళ్లకంటే పెద్ద వయసు పిల్లలుంటే త్రిబుల్ రైడ్ కింద ఫైన్ పడుతుంది.

Love Failure : ఉన్నది ఒకటే జిందగీ..

బండి ఆపిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు, వెహికల్‌కి ఉన్న తాళం తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇది చట్ట విరుద్ధం. ఇలా ఏ అధికారి అయినా వాహనదారుడి అనుమతి లేకుండా తాళం తీసుకుంటే అతనిపై కేసు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
ఫైన్ వేసిన తర్వాత చలాన్ తీసుకుని ఆ సొమ్మును తర్వాత చెల్లించే సదుపాయం ఉంటుంది. కాబట్టి డబ్బులు కట్టేదాకా అక్కడి నుంచి కదలకూడదని చెప్పడానికి పోలీసులకు అధికారం ఉండదు.

ఒకసారి ఫైన్ కట్టిన తర్వాత ఆ రోజంతా తిరిగి అదే ఫైన్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఉదాహరణకు హెల్మెట్ లేదని ఉదయం ట్రాఫిక్ పోలీసులు చలాన్ వేస్తే, సాయంత్రం మళ్లీ చలాన్ కట్టాల్సిన అవసరం లేదు.
రెండు వైపుల దారి ఉన్న రోడ్డు మీద రాంగ్ రూట్‌లో వెళ్లడం చట్టవిరుద్ధం. అయితే రివర్స్ గేర్‌తో వెనకకి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. అయితే వన్ వేలో రివర్స్ చేయడం కూడా నేరంగా పరిగణిస్తారు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post