Pawan Kalyan – Supriya : అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి.. 28 ఏళ్లు అయ్యింది, అయినా ఏం మారలేదు!

Pawan Kalyan - Supriya
Pawan Kalyan - Supriya

Pawan Kalyan – Supriya : పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది అక్కినేని సుప్రియ. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ సినిమా విడుదలయ్యి, దాదాపు 28 ఏళ్లు కావస్తోంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్, పవర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి, జనసేన పార్టీని స్థాపించాడు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని, నూటికి నూరు శాతం రిజల్ట్ రాబట్టాడు..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడుతున్నాడు పవన్ కళ్యాణ్. మరోవైపు అక్కినేని సుప్రియ మాత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు. పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న సుప్రియ (ప్రస్తుతం సుప్రియ యార్లగడ్డ), అడివి శేషు ‘గూఢచారి’ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆడపాదడపా సినిమాల్లో నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తోంది..

Pawan Kalyan : నా రెమ్యూనరేషన్ తగ్గించండి, వాళ్లకు సరైన భోజనం పెట్టండి..

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని తన ఆఫీసులో కలిసింది సుప్రియ. 28 ఏళ్ల తర్వాత కూడా అటు పవన్ కళ్యాణ్, ఇటు సుప్రియ ఇద్దరూ ఏం మారలేదు. మొదటి సినిమాలో ఎలా ఉన్నారో, అలాగే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గడ్డం, జుట్టు పెంచినా కటౌట్ మాత్రం అదే. ప్రస్తుతం ఈ ఇద్దరి ఫోటోలే సోషల్ మీడియాలో ట్రెండింగ్.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post