Banglore News : బెంగళూరు అర్బన్ జిల్లాలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న రెస్టారెంట్ కస్టమర్‌కు వేడి మరియు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంలో విఫలమైనందుకు కోర్టు జరిమానా విధించింది. జూన్ 19న మొదటి అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉడిపి గార్డెన్ రెస్టారెంట్‌కి రూ. 7,000 జరిమానా విధిస్తూ ఉత్తర్వు జారీ చేసింది.
బెంగుళూరులోని కోరమంగళ నివాసి, ఫిర్యాదుదారు తహారా (56) ప్రకారం, ఆమె జూలై 30, 2022న ఫ్యామిలీ ట్రిప్ కోసం హాసన్‌కు వెళుతుండగా, అల్పాహారం చేయడానికి రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఆహారం చల్లగా ఉందని, తాజాగా లేదని ఆమె ఆరోపించారు. దీంతో ఆమె వేడివేడి భోజనం అందించాలని రెస్టారెంట్ సిబ్బందిని కోరగా.. అదేం ఇవ్వలేమని నిర్మొహమాటంగా చెప్పారట రెస్టారెంట్ సిబ్బంది.
మీ భాషాభిమానం తగలెయ్యా! బెంగళూరులో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సీన్స్..
తనకు అధిక రక్తపోటు ఉందని, రెస్టారెంట్లో ఆహారం లేకపోవడంతో మందులు కూడా తీసుకోలేకపోయానని ఫిర్యాదుదారాలు ఆరోపించింది. సర్వీస్ లోపించినందుకు కమిషన్ ప్రెసిడెంట్ బి నారాయణపప్ప రెస్టారెంట్‌కు రూ.5,000 జరిమానా విధించారు. వ్యాజ్యం ఖర్చులను రికవరీ చేసేందుకు తినుబండారానికి రూ.2,000 జరిమానా విధించాడు.