Silk Smitha : సిల్క్ స్మిత ఆత్మహత్యకు కారణమేంటి.. సూసైడ్ లెటర్ ఎందుకు బయటికి రాలేదు..!?

Silk Smitha
Silk Smitha

Silk Smitha : 450 సినిమాలు.. 35 ఏళ్ల వయసున్న ఓ నటి, ఇన్ని సినిమాల్లో నటించిందంటే అది మామూలు రికార్డు కాదు. అలాంటి నటికి స్టార్ డమ్ రాలేదు. హీరోయిన్ కాదు. అలాగని కమెడియన్ కూడా కాదు.. కేవలం వ్యాంపు క్యారెక్టర్లు చేస్తూ దాదాపు 500 సినిమాలు చేసింది సిల్క్ స్మిత. ఆమె కనిపిస్తే చాలు, థియేటర్లలో విజిల్స్ పడేవి. స్టార్లుగా చెప్పుకునే వాళ్ళు ఎంతిచ్చినా కొనలేని స్వచ్ఛమైన క్రేజ్ అది..

ఏలూరులో పుట్టిన విజయలక్ష్మీగా, చెన్నైలో ‘సిల్క్ స్మిత’గా మారి, ఇటు టాలీవుడ్, అటు మాలీవుడ్, మరో పక్క కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేసింది. సిల్క్ స్మిత డేట్స్ కోసం స్టార్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఎంత పెద్ద హీరో నటించిన సినిమా అయినా సరే, సిల్క్ స్మిత పాట లేకపోతే మేం కొనమని డిస్టిబ్యూటర్లు చెప్పేసిన క్రేజ్.. అలాంటి సిల్క్ స్మిత.. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది.. 28 ఏళ్లు అయినా ఇప్పటికీ సిల్క్ స్మిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ఆమె మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది..

Manisha Koirala : మనీషా కోయిరాలా కెరీర్‌, రజినీకాంత్ వల్లే నాశనమైందా.. 

చిన్నతనం నుంచి ఎన్నో బాధలు, చిత్రహింసలు అనుభవించిన సిల్క్ స్మిత, టీనేజ్ వయసులోనే పెళ్లి చేసుకుంది. భర్త, అత్తింటివాళ్లు పెట్టే బాధలు భరించలేక ఇంట్లో నుంచి పారిపోయి చెన్నైకి వచ్చింది. అపర్ణ అనే నటికి టచప్ ఆర్టిస్టుగా మారి, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. ఆంటోనీ ఈస్టమన్ అనే మలయాళ దర్శకుడు, విజయలక్ష్మీని స్మితగా మార్చాడు. సినిమాల్లో చేసే సిల్క్ పాత్ర కారణంగా ‘సిల్క్ స్మిత’గా మారింది..

1996, సెప్టెంబర్ 22న ఓ మూవీ షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత తన స్నేహితురాలు అనురాధకు ఫోన్ చేసి, ఏదో సీరియస్ ఇష్యూ తనను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతోందని చెప్పింది. అయితే అనురాధ అప్పటికే మంచి నిద్రలో ఉండడంతో ఉదయం మాట్లాడుకుందామని చెప్పి, ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాతి ఉదయం తన హోటల్ రూమ్‌లో ఉరేసుకుని కనిపించింది సిల్క్ స్మిత..

Samantha, Savitri, Silk Smitha : వాడుకుని వదిలేస్తుందా ఫిల్మ్ ఇండస్ట్రీ..!?

సిల్క్ స్మిత మరణం తర్వాత ఆమె శరీరంలో మోతాదుకి మించి ఆల్కహాల్ ఉందని రిపోర్టులో తేలింది. ఆమె గది నుంచి ఓ సూసైడ్ నోట్ కూడా దొరికింది. అయితే ఆ సూసైడ్ నోట్‌లో ఏముంది? సిల్క్ స్మితను అంతలా ఇబ్బందిపెట్టిన సీరియస్ సమస్య ఏంటి? ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? వంటి విషయాలు ఈనాటికి మిస్టరీగానే మారాయి. సిల్క్ స్మిత సూసైడ్ నోట్‌లో ఇండస్ట్రీలోని పెద్దల గురించి ప్రస్తావించిందని అందుకే ఆ లేఖను మాయం చేశారని మాత్రం అంటారు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post