Prabhas Salaar : ‘బాహుబలి 2’ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్, ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాలతో ఫ్యాన్స్‌ని పూర్తిగా మెప్పించలేకపోయినా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న ‘సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’ మూవీ, డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డిసెంబర్ 1న రాత్రి 7 గంటల 19 నిమిషాలకు ట్రైలర్ విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
క్రేజీ కాంబో.. గురూజీతో డార్లింగ్..
దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘సలార్’ని రూ.1000 కోట్లకు అమ్మేశారు. అంటే నిర్మాతలకు మూడు రెట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది. ఈ సొమ్మును రాబట్టేందుకు భారీగా ప్లాన్ చేస్తున్నారు డిస్టిబ్యూటర్లు. సినిమా విడుదలయ్యాక మొదటి 2 వారాలు టికెట్ల రేట్లను పెంచేందుకు అవకాశం ఉంటుంది. అయితే బాల్కనీ, సెకండ్ క్లాస్ టికెట్ల రేట్లలో మాత్రమే మార్పులు ఉంటాయి. నేల క్లాస్ రూ.20/రూ.30/రూ.50 టికెట్ రేటులో మాత్రం మార్పు ఉండదు.
అయితే ‘సలార్’ కోసం రూ.50ని రూ.75గా పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ వెళ్లినట్టు సమాచారం. కేవలం కర్ణాటకలోనే 1000కి పైగా థియేటర్లలో ‘సలార్’ మూవీ విడుదల కాబోతోంది. అయితే దాదాపు 90 శాతం థియేటర్లలో ‘సలార్’ విడుదల కాబోతోంది. ఈ సినిమాకి రెండు వారాల ముందు వరకూ ఏ పెద్ద సినిమా విడుదల కాకుండా చర్యలు తీసుకుంటోంది కర్ణాటక డిస్టిబ్యూటర్ హంబల్ ఫిల్మ్.
పవన్ కళ్యాణ్, నాని, కార్తీ.. ఆ హీరోలకి కలిసి రాని 25వ చిత్రాలు..
కేరళ, తమిళనాడుతో పాటు నార్త్ అమెరికాలో కూడా ‘సలార్’ పెద్ద సంఖ్యలో థియేటర్లను లాక్ చేసినట్టు సమాచారం. మొదటి రోజు వసూళ్లతోనే రూ.200 కోట్ల షేర్ రాబట్టాలని ‘సలార్’ టీమ్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే పాజిటివ్ టాక్ వస్తే తొలివారంలో రూ.1000+ కోట్లు వసూళ్లు రాబడుతుంది ‘సలార్’. రెండో వారంలోనే లాభాల్లోకి వచ్చేసింది. నెగిటివ్ టాక్ వచ్చినా వీకెండ్, క్రిస్మస్ ఎఫెక్ట్‌తో దాదాపు రూ.600+ కోట్ల వసూళ్లు వచ్చేస్తాయి. కాబట్టి బయ్యర్లు సేఫ్..
రామ్ చరణ్‌కి జోడిగా సాయి పల్లవి.. కాంబో సెట్ అయ్యిందా, ఫ్యాన్స్‌కి పూనకాలే!