Neredu Health Benefits : నేరేడుతో ఆరోగ్యానికి మేలు..

Neredu Health Benefits : 
Neredu Health Benefits : 

Neredu Health Benefits : వర్షాకాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్స్ లో నేరేడు ఒకటి. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ నేరేడు పండ్లలో అనేక ఔషధ గుణాలుంటాయి. ఇందులో క్యాల్షియం, మెగ్రోషియం, పాస్పరస్ , ఐరన్, విటమిన్ సి అలానే విటమిన్ బి తో పాటు ఇంకా ఎన్నో పోషకాలు ఉన్నాయి. నేరేడు పళ్ళు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్ నిరంవరించవచ్చు. ఇది మధుమొహం బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. నేరేడు పండ్లు మాత్రమే కాదు. దాని గింజలు, ఆకులు మరియు బెరడులో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. అందుకే ఆయుర్వేద ఔషధాలలో వీటిని ఉపయోగిస్తారు.

రోటీ పచ్చళ్ళతో ప్రయోజనాలు..

నేరేడు ఉపయోగాలు :

* పేగులుకు చుట్టుకుపోయిన వెంట్రుకలను కోసేసి బయటకు పంపించే శక్తి ఈ నేరేడు పళ్ళకు ఉంది.
* నేరేడు పళ్ళు శరీరానికి ఎంతో చలవ చేస్తాయి వేడి తాపాన్ని తగ్గిస్తాయి.
* మూత్ర సంబంధిత సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
* దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు నేరేడు పళ్ళు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

* నీరసం, కళ్ళు తిరగడం, నరాల బలహీనత ఉన్నవాళ్లు నేరేడు పళ్ళు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
* చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను, శుభ్రం చేసి బయటకు పంపించడంలో నేరేడు పండు కీలక పాత్ర పోషిస్తుంది.
* నేరేడులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
* జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. ఒంట్లో వేడి తగ్గుతుంది.

Benefits of Crying : ఏడవడం ఓ వరం..

నేరేడులో అనేక ఔషధ గుణాలు ఉన్నప్పటికీ.. గర్భిణీలు వీటిని తినకూడదు. జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతగా తినాలి అనుకుంటే.. ఉప్పు వేసుకొని తీసుకోవాలి. అన్నం తిన్న గంట తర్వాత తీసుకుంటే.. ఆహారం జీర్ణం అవుతుంది. అలాగని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే.. నోరు వెగటుగా ఉండడమే కాకుండా మలబద్దక సమస్య రావచ్చు.

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post