Poonam Kaur : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ హాట్ టాపిక్ అయ్యింది. ‘ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు ఎంత ఛిత్రవధ అనుభవించాడో ఊహించుకుంటేనే బాధేస్తోంది. ఓ అమాయక అమ్మాయిని దెయ్యాలు, ప్రేత ఆత్మలే భరించలేకపోతున్నాయి. ఆ ప్లేస్‌లో ఉదయ్ కిరణ్ ఉంటే ఏమయ్యేదో.. అతను చచ్చి, బతికిపోయాడు.. ఉదయ్ కిరణ్ సక్సెస్‌ఫుల్ మ్యాన్.. ఐ ఫీల్ యూ ఉదయ్’ అంటూ స్టోరీ పోస్ట్ చేసి, కొద్దిసేపటికి దాన్ని డిలీట్ చేసింది పూనమ్ కౌర్..
పూనమ్ కౌర్ ప్రత్యేక్షంగా చెప్పకపోయినా చిరంజీవి కూతురు గురించే ఈ స్టోరీ పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఉదయ్ కిరణ్, వరుస హిట్లతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో చిరూ కూతురు సుష్మితతో ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. అక్కడి నుంచే ఉదయ్ కిరణ్‌కి కష్టాలు మొదలయ్యాయి..
Pawan Kalyan – Trivikram : కోబలి మూవీ ఎందుకు ఆగిపోయిందంటే..!?
అప్పటికే సైన్ చేసిన 10 భారీ బడ్జెట్, పెద్ద డైరెక్టర్ల సినిమాలు ఆగిపోయాయి. అందులో సగం షూటింగ్ పూర్తి అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా నిర్మాతలు, సినిమాల కోసం ఇచ్చిన అడ్వాన్స్‌లను కూడా వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వరుస ఫెయిల్యూర్స్‌తో ఉదయ్ కిరణ్ పైన, ఫ్లాప్ హీరో ముద్ర పడింది. బాగున్న సినిమాలకు కూడా నెగిటివ్ రివ్యూలు రావడం, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో ఫెయిల్యూర్స్‌ని ఫేస్ చేయలేకపోయిన ఉదయ్ కిరణ్, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతను నటించిన చివరి సినిమా, ‘చిత్రం చెప్పిన కథ’ ఇంతవరకూ రిలీజ్ కాలేదు.