Sri Reddy Marriage : బైరెడ్డి సిద్ధార్థ్‌తో శ్రీరెడ్డి పెళ్లి! ఇది మామూలు ట్విస్ట్ కాదు బాబోయ్..

Sri Reddy Marriage
Sri Reddy Marriage

Sri Reddy Marriage : టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటపెట్టి, బీభత్సమైన పాపులారిటీ తెచ్చుకుంది శ్రీరెడ్డి. దగ్గుబాటి అభిరామ్, తనకు అవకాశం ఇస్తానని నమ్మించి, వాడుకుని వదిలేశాడని ఆరోపించి, ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో బూతులు తిడుతూ, వీడియోలు చేస్తూ ఓ వర్గానికి చేరువైంది. గత ఎన్నికల్లో వైఎస్ జగన్‌కి సపోర్ట్ చేసిన శ్రీరెడ్డి, త్వరలో వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పెళ్లి చేసుకోబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్ అథారిటీకి ఛైర్మెన్‌గా ఉన్నాడు. సిద్ధార్థ్ పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏపీకి ఎమ్మెల్యేగా పనిచేశాడు. రెండేళ్లుగా శ్రీరెడ్డి, సిద్ధార్థ్ సహజీవనం చేస్తున్నారని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని గట్టిగా టాక్ వినబడుతోంది. శ్రీరెడ్డి, చాలాసార్లు తన వీడియోల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో రిలేషన్‌లో ఉన్నట్టుగా చెప్పింది కూడా..

Balakrishna : బాలయ్యకి జట్టు ఎక్కువున్న వాళ్లని చూస్తే కోపం వస్తుంది! డైరెక్టర్ కామెంట్స్..

అయితే శ్రీరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. అందుకే ఆమె కామెంట్లను ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలేదు. వైసీపీ ఓటమితో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మీద సెటైరిక్‌గా శ్రీరెడ్డితో పెళ్లి రూమర్ క్రియేట్ చేసి ఉంటారని కూడా అనుమానాలు ఉన్నాయి. మోటివేషనల్ స్పీచ్‌లతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కూడా సోషల్ మీడియాలో గట్టి ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ ఈ రూమర్ నిజమైతే మాత్రం ఇది సోషల్ మీడియా జనాలకు మామూలు ట్విస్ట్ కాదు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post