Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ కేబినేట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కీలక బాధ్యతలు దక్కాయి. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాఫీసుల్లో సీఎం చంద్రబాబు నాయుడితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా పెట్టాలని ప్రభుత్వం సూచించింది..
ఇలా ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌కి దక్కుతున్న ప్రాముఖ్యాన్ని చూసి, చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓర్వలేకపోతున్నాడా? సోషల్ మీడియాలో ఓ వర్గం ఈ రకంగా ప్రచారం చేస్తోంది. తన తండ్రి నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీని చంద్రబాబు నడిపిస్తున్నాడు. పోనీలే, బావ కదా అని ఊరుకుంటే ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చాడు? ఇస్తే గిస్తే నాకు ఆ పదవి ఇవ్వాలి కానీ ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని పవన్‌కి ఎలా ఇస్తారని బాలయ్య, తన సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
Mega Family : మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న అల్లు ఫ్యామిలీ..
ఈ వార్తల్లో నిజం లేదని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. కేవలం తెలుగుదేశం- జనసేన కూటమిలో చిచ్చు రేపేందుకు కొందరు వైసీపీ నాయకులు కావాలని ఇలాంటి ప్రచారం మొదలెట్టారని ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి బాధ్యత ఇచ్చినా, తనకి ఎలాంటి అభ్యంతరం లేదని నందమూరి బాలకృష్ణ, తన బావ చంద్రబాబుకి చెప్పాడని చెబుతున్నారు.