Muppa Ganga Reddy : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, కిసాన్ కేతు జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డిపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది.. ఆమె ఆరోపణల ప్రకారం కిసాన్ కేసు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, కొన్నాళ్లుగా తనతో సహజీవనం చేస్తున్నాడు.. ఆమెకి అప్పటికే పెళ్లై, 19 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. భర్త లేని ఆమెతో ముప్ప గంగారెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకుని, తనకు ఆస్తిలో వాటా కూడా ఇస్తానని మాటిచ్చాడు..
ఆమెకు తన భార్యతో సమానంగా ఆస్తిలో వాటా ఇస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి, లోబర్చుకున్నాడు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమెను పట్టించుకోవడం మానేశాడు ముప్ప గంగారెడ్డి… ఆస్తిలో వాటా గురించి అడిగితే, చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధిత మహళ, ప్రజా భవన్ వద్ద ఆందోళన చేపట్టింది..
Delhi High court: ఆ వీడియో తొలగించాలని సునీతా కేజ్రీవాల్‌ను ఆదేశించిన కోర్టు..
కాంగ్రెస్ పార్టీ నేతపై సంచలన ఆరోపణలు రావడంతో ఈ విషయం రాజకీయ మలుపు తీసుకుంది. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు… ఈ విషయం స్థానికంగా కలకలం క్రియేట్ చేసింది.