Train Accident : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రాష్ట్ర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ ట్రైయిన్‌ని ఢీ కొనడంతో పట్టాలు తప్పి, రైల్వే బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 25 నుంచి 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 13174 నెంబర్ కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్, అగర్తాల నుంచి బయలుదేరింది. జల్పైగురి రైల్వే స్టేషన్ సమీపంలో రంగపాణి ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది..
రైల్వే ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న రైల్వే రక్షణ సిబ్బందితో పాటు రైల్వే శాఖ అధికారులు, సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు మొదలెట్టారు. గూడ్స్ ట్రైయిన్‌ని ఢీకొనడంతో కొన్ని బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో బోగీల్లో చిక్కుకున్నవారికి బయటికి తీయడం చాలా కష్టంగా మారింది..
Uttarakhand : లోయలో పడిన టెంపో.. 12 మంది మృతి..
ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గత ఏడాది జూన్‌లో ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఇదే విధంగా ప్రమాదానికి గురైంది. ప్రయాణీకులతో వెళ్తున్న రెండు ట్రైయిన్లతో పాటు ఓ గూడ్స్ ట్రైయిన్ ఈ ప్రమాదంలో ఢీకొనడంతో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు, వెయ్యికి పైగా జనాలు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన ఏడాదికి సరిగ్గా జూన్‌లో మరో రైలు ప్రమాదం జరగడం విశేషం..