Bear Grylls : ఓ సాహసవీరుడి కథ..

Bear Grylls
Bear Grylls

Bear Grylls : NEVER GIVE UP.. అన్న నినాదానికి Exampleగా మనం చాలామంది జీవితాలని విని ఉంటాం, చూసి ఉంటాం.. కానీ కొంత మందిని చూస్తే వీరిని చూసే ఆ పదం పుట్టిందేమో అనిపిస్తుంది. అలాంటి ఒక వ్యక్తి “బేర్ గ్రిల్స్” (Edward Michael Bear Grylls). ఇతను నార్తర్న్ ఐర్లాండ్ (UK)లో జూన్ 7, 1974 లో ప్రొఫెషనల్ క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించాడు.

అతి చిన్న వయస్సు నుంచే బేర్ తన సాహసాలకి పదును పెట్టడం మొదలు పెట్టాడు. ఇరవై ఏళ్ల వయస్సులో టెరిటోరియల్ సైన్యంలో చేరి మూడేళ్లు సేవలందించాడు. ఈ క్రమంలో 1996లో కెన్యాలో జరిగిన ప్యారచుట్ ఏక్సిడెంట్ తో బేర్ వెన్నెముక మూడు చోట్ల విరిగిపోయింది. దీంతో అతను SAS నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది. Bear పారచూట్ సరిగా తెరుచుకోక పోవటంతో అమాంతం నేలపై కులిపోయాడు. ఇక Bear తన పని తానూ చేసుకోవటం కూడా కష్టమని డాక్టర్లు చెప్పారు.

Kuwait Fire Incident : కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మృతుల్లో భారతీయులు..

కానీ ఆ తర్వాత అందరూ ఆశ్చర్యపోయేలా తన సంకల్పంతో 18 నెలలకే కోలుకొని ప్రపంచంలో అతి ఎత్తైన Mt.Everest ని అధిరోహించి అతి చిన్న వయసులోనే ఆ ఘనత సాధించిన వ్యక్తి గా రికార్డ్ సృష్టించాడు Bear Grylls. ఆత్మ విశ్వాసానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేం చెప్పగలం. Bear తన 23వ ఏట British Royal Marinesలో చేరి అత్యంత తక్కువ వయసులో Commander స్థాయిలో ప్రమోషన్ పొందాడు.

ఇక Bear జీవితాన్ని మార్చిన Tv show – “The Man Vs Wild”. దీన్ని 29 November 2011, Discovery ఛానల్ లో మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. ఈ Tv Showతో తాను ప్రపంచంలో ఉన్న గొప్పగొప్ప Adventurers నుంచి ప్రశంసలు పొందాడు. ఒక మనిషి అనుకోకుండా ఎక్కడైనా జనావాసం లేని ప్రాంతంలో చిక్కుకుంటే.. ఎలా బ్రతికి బయట పడాలి అనేది Bear ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడు.

ఈ Show తర్వాత..
* Running Wild with Bear Grylls,
* The Island with Bear Grylls, * You Vs Wild,
* World ‘s Toughest Race,
Eco Challenge.. వంటి ఎన్నో టీవీ షోస్ చేసి ప్రపంచ దేశాల్లో ఎంతో Famous అయ్యాడు. Bear ఒక Adventurer మాత్రమే కాదు Writer కూడా, ఇతను రాసిన “MUD SWEAT AND TEARS”, “THE AUTOBIOGRAPHY” Books మిలియన్ కాపీస్ అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు BEAR 10 పుస్తకాల వరకు రాశాడు.

PM Modi – Ram Mandir : రామమందిరం కట్టిన చోటే, బీజేపీ ఎందుకు ఓడింది?

Bear ఎంత ఫేమస్ అంటే భారత ప్రధాని “Narendra Modi”, అమెరికా ప్రెసిడేంట్ Obama, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ Zelensky, ఇంకా ఎంతో మంది ప్రపంచ ప్రముఖ వ్యక్తులు మరియు ఎంతోమంది సెలబ్రిటీస్ తో చేసిన షోలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక Army Soldierగా, Social Workerగా, Entertainer గా Bear ఎల్లప్పుడూ సమాజానికి ఎంతగానో సేవ చేస్తూ వచ్చాడు. ఎన్నో Childrens Welfare Schoolsని తన సొంత డబ్బుతో రన్ చేయడం విశేషం.

Survival Planలో భాగంగా బతికి బయటపడటానికి Bear ఏమైనా చేయగలడు. ఎలాంటి ఆహారానికైనా అలవాటుపడి ప్రాణాలకు తెగించి సాహసాలు చేసేది ఎందుకంటే.. అందరికీ సర్వైవల్ గురించి అవగాహన ఇవ్వటానికి, జీవితంలో అందరూ స్ట్రాంగ్ గా ఉండాలని ఒక ఇంటర్వ్యూ లో బేర్ చెప్పాడు. ఈ ప్రపంచంలో బతికున్న జీవుల్లో బహుశా మనిషిని తప్పా మిగిలిన వాటన్నింటిని Bear తినగలడు అంటే అతిశయక్తి కాదు!

ఇలా తన ధైర్యసాహసాలతో Bear Grylls ఎంతోమందికి Inspirationగా ఉండి, Motivational Speekerగా కూడా మారాడు. ఓ సాహసవీరుడిగా Bears ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.

Credit : Kallam Yugandhar

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post