Kolkata Fire Accident: దక్షిణ కోల్‌కతాలోని అక్రోపోలిస్ మాల్లో శుక్రవారం భారీ మంటలు చెలరేగాయి. అధికారులు వెంటనే స్పందించి, మంటలను ఆర్పేందుకు పది ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి పంపించారు. మధ్యాహ్నం 12:15 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. ఒక గాజు భవనం నుండి పొగలు కమ్ముకున్నాయి. తరువాత, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యను సులభతరం చేయడానికి గాజును పగలగొట్టినట్టు తెలిపారు.
NEET UG result 2024 : తిరిగి పరీక్షకు హాజరుకావచ్చు..
అయితే ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. “కొందరు అగ్నిమాపక సిబ్బంది ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి భవనంలోకి ప్రవేశించారు” అని తెలిపారు.
ఈ ఘటనపై జాదవ్‌పూర్ డివిజన్ డీసీపీ బిదిషా కలితా దాస్‌గుప్తా మాట్లాడుతూ.. మంటలను అదుపులోకి తెచ్చామని, అయితే పూర్తి వివరాలు ఇప్పుడేమీ చెప్పలేమని అన్నారు.
తాజా విజువల్స్‌లో, అగ్నిమాపక యంత్రాలు, పొగతో కప్పబడి ఉన్నాయి. మాల్ వెలుపల, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు, అయితే అధికారులు దూరంగా వెళ్లి దూరంగా నిలబడాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించినట్లు పోలీసులు తెలిపారు.
https://x.com/ANI/status/1801521956111491473?t=oxtXFFEb6cMbGx7NFIpzQA&s=19