Vijay Sethupathi – Trisha : క్లైమాక్స్‌లో త్రిషతో లిప్‌లాక్ రాసుకున్న డైరెక్టర్.. హీరో ఏం చేశాడంటే..

Vijay Sethupathi - Trisha
Vijay Sethupathi - Trisha

Vijay Sethupathi – Trisha : ఓటీటీ యుగంలో భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూసేస్తున్నారు జనాలు. అలా తెలుగువాళ్లకి బాగా నచ్చిన సినిమాల్లో ‘96’ ఒకటి. తమిళ్‌లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), త్రిష (Trisha) హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమాని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేశారు. సేతుపతి పాత్రలో శర్వానంద్, త్రిష క్యారెక్టర్‌లో సమంత నటించింది.

కోలీవుడ్‌లో ‘96’ సినిమా సూపర్ హిట్ కాగా, ‘జాను’ ఆ మ్యాజిక్‌ని మళ్లీ రీక్రియేట్ చేయలేకపోయింది. అయితే పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. కోలీవుడ్ రూపొందించిన బెస్ట్ ఫీల్ గుడ్ మూవీస్‌లో ‘96’ ఒకటి.

స్కూల్‌లో తాను ప్రేమించిన అమ్మాయిని, రీయూనియన్ పార్టీలో మళ్లీ 24 ఏళ్ల తర్వాత కలుసుకుంటాడు హీరో. అప్పటికే ఆమెకి పెళ్లి అయిపోయి, ఓ కూతురు కూడా ఉంటుంది. వారిద్దరూ ఒక రోజంతా కలిసి ఉంటారు. తమ స్కూల్ రోజులను గుర్తు చేసుకుంటారు. బడిలో ప్రేమించిన జానుని ఇంకా తలుచుకుంటూ పెళ్లి చేసుకోకుండా బతికేస్తూ ఉంటాడు రామ్. ఆ విషయం తెలుసుకున్న జాను, బరువెక్కిన గుండెతో తిరిగి తన ఇంటికి పయనమవుతుంది.

Ice Cream Finger : ఐస్ క్రీమ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. ఐస్‌క్రీమ్‌లో కనిపించిన వేలు..

నిజానికి ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్‌కుమార్ చంద్రన్, క్లైమాక్స్‌లో జాను, రామ్ మధ్య లిప్‌లాక్ ఉండాలని రాసుకున్నాడట. రామ్ క్యారెక్టర్‌ని ఎంతో ఇష్టపడి చేశాడు విజయ్ సేతుపతి. జాను వెళ్లిపోయే ముందు రామ్‌కి లిప్‌లాక్ పెడితే అప్పటిదాకా పవిత్రంగా ఫీలైన ప్రేమను, కామంగా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని దర్శకుడికి చెప్పాడట విజయ్ సేతుపతి.

దీంతో లిప్‌లాక్ సీన్‌ని తొలగించి, ఎయిర్‌పోర్ట్‌లో రామ్ ముఖం మీద జాను చేతులు పెట్టి ఏడుస్తూ, తిరిగి వెళ్లిపోయే సీన్‌ని రాసుకున్నాడు ప్రేమ్‌కుమార్ చంద్రన్. ఇది చాలామంది హృదయాలను కదలించి, తమ స్కూల్ డేస్ లవ్ స్టోరీస్‌ని గుర్తుకు తెచ్చింది. అక్కడ లిప్‌లాక్ ఉండి ఉంటే, జనాలను ఇంతగా కదిలించేది కాదేమో..

Tollywood vs Kollywood : పిచ్చి, వెర్రి, అంతకుమించి.. సోషల్ మీడియాలో టాలీవుడ్ vs కోలీవుడ్ రచ్చ..

అయినా హీరోయిన్లతో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా పెట్టమని దర్శకులను డిమాండ్ చేసే హీరోల మధ్య, త్రిష లాంటి ఎవర్‌గ్రీన్ బ్యూటీతో లిప్‌లాక్ ఛాన్స్ వచ్చినా కూడా వద్దని చెప్పిన విజయ్ సేతుపతిని మెచ్చుకోవాల్సిందే.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post