Devara – Pushpa 2 : తారక్ ముందుకి, బన్నీ వెనక్కి! పవన్ పరిస్థితి ఏంటో..

Devara - Pushpa 2
Devara - Pushpa 2

Devara – Pushpa 2 : ఏపీ ఎలక్షన్స్ ఎఫెక్ట్‌తో స్టార్ల సినిమాల డేట్లు మారాయి. ఎన్టీఆర్ ‘దేవర’ ముందుగా అనుకున్న అక్టోబర్ 10 డేట్‌కి రెండు వారాల ముందే థియేటర్లలోకి రాబోతోంది. పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న ‘They Called him OG’ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27న, ‘దేవర’ మూవీ రిలీజ్ అవుతోంది. అధికారికంగా ఈ రిలీజ్ డేట్‌ని ప్రకటించేశాడు ఎన్టీఆర్..

దీంతో పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ, ఈ ఏడాదిలో రిలీజ్ కానట్లే. వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే, ఈ సినిమాలో మిగిలిన షూటింగ్‌ పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావడానికి సుజిత్ ప్రయత్నాలు చేయవచ్చు. అయితే ఏపీ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో పవన్ కళ్యాణ్, సినిమాల గురించి ఆలోచిస్తాడా? అనేది చాలా పెద్ద ప్రశ్నగా మారింది. కేవలం ఎమ్మెల్యేగా ఉండి ఉంటే, పవన్ ఈ సినిమాని ఇదే ఏడాది పూర్తి చేయాలని అనుకున్నాడట. కానీ అదనపు బాధ్యతలపై ‘OG’ పరిస్థితి ఏంటో తెలియని అయోమయంలో పడ్డాడు డైరెక్టర్ సుజిత్..

Pushpa 2 postponed : పుష్పరాజ్ భయపడ్డాడా..!?

అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఇంతే. అనవసరంగా ఏపీ పాలిటిక్స్‌లో వేలు పెట్టిన అల్లు అర్జున్, ‘పుష్ప 2’ సినిమాని ఆగస్టు 15న తీసుకురావాలని తెగ కష్టపడుతున్నాడు. అయితే కొన్ని సీన్స్ విషయంలో సుకుమార్ సంతృప్తి చెందకపోవడంతో రీషూట్స్ చేయబోతున్నారట. దీంతో అనుకున్న సమయానికి ‘పుష్ప’ రావడం అనుమానమే. ఈ మూవీకి కొత్త రిలీజ్ డేట్‌గా అక్టోబర్ 10 ఖాళీగా ఉంది. అయితే అదే రోజు రజినీకాంత్ ‘వెట్టైయన్’ రిలీజ్ ఉంది. రజినీతో పోటీ పడేందుకు బన్నీ సిద్ధంగా ఉంటాడా? లేక తనకి బాగా కలిసి వచ్చిన డిసెంబర్‌లోకి వెళ్తాడా? త్వరలోనే తెలియనుంది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post