Harom Hara Movie Review : సుధీర్ బాబు గత మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర జీరో షేర్ వసూలు చేశాయి. ‘హంట్’, ‘మామ మశ్చీంద్ర’ సినిమాలు అయితే సుధీర్ బాబు ఫ్యాన్స్‌ని కూడా మెప్పించలేకపోయాయి. మార్కెట్ పడిపోయి, బాగా డల్ అయిపోయిన సుధీర్ బాబు గ్యాప్ తీసుకుని, ‘హరోం హర’ మూవీ చేశాడు. సాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Mega Family : మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న అల్లు ఫ్యామిలీ..
ఆంధ్రప్రదేశ్ రాష్టరంలో రాయలసీమ పాంతంతో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కథ ఇది. ఒక్క గన్నుకి బాగా లాభం ముడుతుందని తెలిసిన సుబ్రహ్మాణ్యం, తానే స్వయంగా గన్స్ తయారుచేయడం నేర్చుకుంటాడు. అలాగే రకరకాల గన్స్ తయారుచేసి, ఆ పనిలో రాటుతేలిపోతాడు. మార్కెట్ పెరుగుతుంది, శత్రువులు పెరుగుతారు. మరి హీరో, ఆ శత్రువులను ఎలా ఫేస్ చేశాడు. ఇదే ‘హరోం హర’ మూవీ…
చిత్తూరు జిల్లా ప్రాంతంలో జరిగిన కథ కావడంతో సినిమాలో చిత్తూరు యాస ఉంటుంది. చిత్తూరు యాసలో చెప్పే డైలాగులు, అల్లు అర్జున్ పుష్ప మూవీని గుర్తుకు తెస్తాయి. విభిన్నమైన కథలు చేయాలనే తాపత్రయంలో షాకుల మీద షాకులు తిన్న సుధీర్ బాబు, ఈసారి పక్కా మాస్ యాక్షన్ బొమ్మను సెలక్ట్ చేసుకున్నాడు. డైరెక్టర్ సాగర్ ద్వారక, సుధీర్ బాబుని కొత్త అవతరాంలో చూపించాడు.
Chandrababu Naidu Oath Ceremony : రామ్ చరణ్ వచ్చాడు, ఎన్టీఆర్ ఎక్కడ? ఆహ్వానం అందలేదా..
నటుడిగానూ బాగా ఇంప్రూవ్ అయ్యాడు సుధీర్ బాబు. హీరోయిన్ మాళవిక శర్మ పాటల కోసం, రొమాంటిక్ సీన్స్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. సునీల్, ఇతర నటులు తమ పాత్రల్లో చక్కగా నటించారు. చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని ప్రధాన బలం. యాక్షన్ సీన్స్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు చేతన్. డైరెక్టర్ సాగర్ ద్వారక తనలో విషయం ఉందని నిరూపించుకున్నాడు. మొత్తానికి ఎలాంటి అంచనాలు వెళ్లిన వారికి ‘హరోం హర’ మంచి మాస్ యాక్షన్ డ్రామా రుచి చూపిస్తుంది. వరుస ఫ్లాపుల తర్వాత మహేష్ బావగారు కమ్‌బ్యాక్ ఇచ్చినట్టే..