రామ్ చరణ్‌కి జోడిగా సాయి పల్లవి.. కాంబో సెట్ అయ్యిందా, ఫ్యాన్స్‌కి పూనకాలే!

Ram Charan : ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీ తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో సినిమా చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో సాగే ఈ మూవీని తొలుత ఎన్టీఆర్‌తో చేయాలని అనుకున్నాడు బుచ్చిబాబు.

1983 World Cup History : వరల్డ్ కప్ ను ముద్దాడిన వేళ..

అయితే ప్రస్తుతం ‘దేవర’ సినిమాని రెండు పార్టులుగా చేస్తున్న ఎన్టీఆర్, ఆ తర్వాత ‘వార్ 3’ మూవీ చేయాల్సి ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది. ఇవన్నీ అయ్యేసరికి ఎంత లేదన్నా మూడు నాలుగేళ్లు పడుతుందని చరణ్‌ని ఒప్పించి, ప్రాజెక్ట్ కన్ఫార్మ్ చేసుకున్నాడు.

Ram Charan

తాజాగా రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కే సినిమాలో హైబ్రీడ్ పిల్ల సాయి పల్లవిని హీరోయిన్‌గా సెలక్ట్ చేసుకున్నారని టాక్. సాయి పల్లవి కథ ఎంతో నచ్చితే కానీ సినిమా చేయడానికి అంగీకరించదు. ‘ఉప్పెన’ మూవీతో నేషనల్ అవార్డు కొట్టిన బుచ్చిబాబు, చెర్రీ సినిమా కోసం ఓ పవర్ ఫుల్ కంటెంట్‌నే రాసుకున్నాడట. దీంతో సాయి పల్లవి ఒప్పుకునే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయని సమాచారం.

ఎన్టీఆర్ – రాజ్‌కుమార్ మధ్య సీక్రెట్ ఒప్పందం.. ఆ ఒక్క కారణంగానే..

‘గార్గీ’ మూవీ తర్వాత రెండేళ్లు బ్రేక్ తీసుకున్న సాయిపల్లవి ప్రస్తుతం, నాగచైతన్య, చందూ మొండేటి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే శివకార్తీకేయన్ సినిమాకి సైన్ చేసింది. కోలీవుడ్‌లో ధనుష్, సూర్య వంటి హీరోల సినిమాల్లో నటించిన సాయి పల్లవి, తెలుగులో మాత్రం టాప్ స్టార్స్ సినిమాల్లో కనిపించలేదు.

ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తే, వీరిద్దరి డ్యాన్స్‌లకు థియేరట్లు హోరెత్తిపోవడం ఖాయం. చెర్రీ మంచి డ్యాన్సర్. సాయి పల్లవి డ్యాన్స్‌ల గురించి చెప్పాల్సిన పనేలేదు. ఈ ఇద్దరూ కలిసి స్టెప్పులేస్తే.. మ్యూజికల్ ఫ్యాన్స్‌కి పండగే.

నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post