Vande Bharat: వందే భారత్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం..

Vande Bharat : రైళ్ల రిజర్వ్‌డ్‌ కోచ్‌లలో టికెట్‌ లేని ప్రయాణికుల ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమస్య ముందుగా రిజర్వేషన్ల కోసం చెల్లించే ప్రయాణీకులకు తీవ్ర అసౌకర్యాన్ని  కలిగిస్తుంది. ఇటీవల ప్రీమియం సర్వీస్‌గా పేరుగాంచిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా టిక్కెట్‌లేని ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.

అర్చిత్ నగర్ షేర్ చేసిన వీడియో, లక్నో మరియు డెహ్రాడూన్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లోని అస్తవ్యస్త దృశ్యాన్ని క్యాప్చర్ చేసింది.  క్లిప్‌లలో ప్రయాణికులు గుంపులు గుంపులుగా ఉండడాన్ని గమనించవచ్చు.

Mohan Bhagwat : ఎన్నికలంటే పోటీ యుద్ధం కాదు..

రైల్వే ప్రయాణీకుల కోసం అధికారిక సహాయ ఖాతా అయిన రైల్వే సేవా కూడా వైరల్ ఫుటేజీని గమనించి, ” సమస్య మా వరకు వచ్చింది, సహాయం చేయడానికి కృషి చేస్తాం, సమస్యను వెంటనే సంబధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు”.

అనేక మంది నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మరియు అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది వినియోగదారులు ప్యాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే కొంతమంది అన్ని రైల్వే స్టేషన్‌లలో మెట్రో టిక్కెట్లు మరియు ధృవీకరణ విధానాన్ని అమలు చేయాలని కోరారు.

Delhi News : వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధమైన ఢిల్లీ..

ఒక వినియోగదారు ఈ విధంగా స్పంచాడు :  ”దయచేసి ప్యాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచండి.  వందే భారత్ ఐసే నహీ చలేగా. కిక్కిరిసిన బస్సులా కనిపిస్తోంది’’ అన్నాడు.

వందే భారత్ రైలు స్వదేశీంగా తయారు చేయబడిన, సెమీ-హై స్పీడ్ మరియు స్వీయచోదక రైలు సెట్.  ఈ రైలు అత్యాధునికమైన ప్రయాణీకుల సౌకర్యాలను కలిగి ఉంది. రైల్వే ప్రయాణీకులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.

https://twitter.com/architnagar/status/1799581362045030709?t=DY-Ejm5eECxApy2Z8zesHg&s=19

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post