Mammootty – Allu Aravind : పవన్ కళ్యాణ్ సినిమాలో మమ్మూట్టీ.. అల్లు అరవింద్‌కి షాక్..

Mammootty – Allu Aravind : టాలీవుడ్‌లో ‘మెగాస్టార్’ చిరంజీవి అయితే మలయాళ ఇండస్ట్రీలో ఆ బిరుదు ‘మమ్మూట్టీ’ సొంతం. మిగిలిన హీరోల్లాగా స్టార్ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా నటుడిగా తనకు తాను పరీక్ష పెట్టుకుంటూ వినూత్నమైన పాత్రలు వెతుక్కుంటూ చేస్తున్నాడు మమ్మూట్టీ.. ఆ విషయంలో మమ్మూట్టీకి పోటీ ఇచ్చే స్టార్, ఇండియాలోనే లేడు..

హీరోగా అక్కడ అద్భుతమైన మార్కెట్ ఉన్న సమయంలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ‘స్వాతి కిరణం’ మూవీ చేశాడు మమ్మూట్టీ. ఆ తర్వాత ఆయనకి తెలుగు నుంచి చాలా ఆఫర్లు వచ్చినా, పాత్ర నచ్చకపోవడంతో చేయలేదు. గత ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఏజెంట్’ సినిమాలో ఓ కీ రోల్ పోషించాడు మమ్మూట్టీ. అయితే దీనికి 10 ఏళ్ల ముందే పవన్ కళ్యాణ్ సినిమాలో మమ్మూట్టీని విలన్‌గా నటింపచేయాలని అనుకున్నాడట నిర్మాత అల్లు అరవింద్.

Tollywood Heros Tags : హీరోలకు ‘స్టార్’ ట్యాగ్‌ల పిచ్చి.. ఆఖరికి శర్వానంద్ కూడా తగిలించుకున్నాడుగా..

‘10 ఏళ్ల ముందు మమ్మూట్టీ గారికి నేను ఫోన్ చేసి, ‘సార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉంది. మీరు చేయాలి సార్’ అన్నాను.. ఆయన ఏం క్యారెక్టర్ అన్నారు. పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ సార్.. మీరు చేస్తే బాగుంటుందని చెప్పాను. ఆయన వెంటనే చిరంజీవి ఉన్నారు, తను చేయొచ్చుగా అన్నారు. నేను, చిరంజీవి అలాంటి క్యారెక్టర్ చేయరు సార్ అన్నాను.. మరి నేనేలా చేస్తాను.. అన్నారు.. నేను షాక్ అయ్యాను.. అది మమ్మూట్టీగారి రేంజ్..’ అంటూ చెప్పాడు నిర్మాత అల్లు అరవింద్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post