Capgras Syndrome : కాప్‌గ్రాస్ సిండ్రోమ్ అనేది ఒక అరుదైన మానసిక రుగ్మత, ఆ వ్యక్తి చుట్టూ ఉన్నవాళ్ళని కుటుంబ సభ్యులను, స్నేహితులను మోసగాళ్లలాగ చూడటం లేదా.. వీళ్ళు నకిలీ మనుషులు అనే భ్రమలో ఉంటారు. ఈ భ్రమ వాళ్లతో పాటు మిగిలిన వాళ్ళకి కూడా బాధ కలిగించవచ్చు. ఈ లక్షణాలను నివారినచడానికి మానసిక చికిత్స అవసరం కావొచ్చు.
లక్షణాలు :
కాప్‌గ్రాస్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు ప్రేమించిన వ్యక్తిపై తీవ్రమైనా అపనమ్మకం, వాళ్లు మోసం చేస్తారని భయపడటం, తీవ్రమైన ఆందోళన, ఇతరులను మోసగాళ్లని నిరూపించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు.
కారణాలు :
కాప్‌గ్రాస్ సిండ్రోమ్ కి ఖచ్చితమైన కారణం పూర్తిగా తెలీలేదు. అయితే ఇది తరచుగా మెదడు పనితీరును ప్రభావితం చేసే స్కిజోఫ్రెనియా, అల్జీమర్స్ వ్యాధి, మూర్ఛ లేదా మెదడు గాయాలు వంటి పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉందిని మాత్రమే తెలుస్తుంది.
న్యూరోలాజికల్ బేసిస్ :
క్యాప్‌గ్రాస్ సిండ్రోమ్ అనేది ముఖాన్ని గుర్తు పెట్టుకుని మనకి తెలియచేసే బాధ్యత వహించే చోట డిస్‌కనెక్ట్ అయిన కారణంగా సంభవించవచ్చుని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఈ డిస్‌కనెక్ట్ ఒక సుపరిచితమైన వ్యక్తి ఒకేలా కనిపిస్తుంన్నారు అనే భావనకు దారి తీయవచ్చు, కానీ భావోద్వేగ సంబంధం లేదు.
పిల్లల్లో మొబైల్ వాడకం పెరగడానికి కారణాలు..
చికిత్స :
క్యాప్‌గ్రాస్ సిండ్రోమ్ చికిత్స ప్రాథమికంగా అంతర్లీన పరిస్థితిని పరిష్కరించడంపై దృష్టి పెడతారు. ఇందులో స్కిజోఫ్రెనియా, కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ లేదా సైకో ఎడ్యుకేషన్‌కు సంబంధించిన యాంటిసైకోటిక్ మందులు వారి భ్రమలను అర్థం చేసుకోవడానికి సహాయపడవచ్చు.
కేస్ హిస్టరీ :
ఈ సిండ్రోమ్‌కు ఫ్రెంచ్ మనస్తత్వవేత్త జోసెఫ్ కాప్‌గ్రాస్ పేరు పెట్టారు. అతను తన సహోద్యోగి జీన్ రెబౌల్-లాచౌక్స్‌తో కలిసి 1923లో మేడమ్ ఎమ్ అనే రోగిని పరిశీలించిన తర్వాత దీనిని మొదట వివరించారు. ఈ కేసు శాస్త్రీయపరమైన విచారణకు నాంది పలికింది.
మెనుస్ట్రువల్ కప్ ఎవరు వాడాలి, ఎలా వాడాలి, లాభనష్టాలేంటంటే..
మానసిక రుగ్మత అనేది.. శరీరానికి ఉన్నట్టే మానసికగా కలిగే వ్యాధి. “మానసిక రుగ్మతని పిచ్చిని భావించడం నిజంగా మీ పిచ్చే..”