Gangs of Godavari OTT Release: అప్పుడే ఓటీటీలోకి వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..

Gangs of Godavari OTT Release: ఒకప్పుడు ఓ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయితే, టీవీల్లో ఎప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురుచూడాల్సి వచ్చేది. థియేటర్లలోకి వచ్చిన సినిమా, టీవీల్లోకి రావాలంటే మూడేళ్లు పట్టేది. మెల్లిమెల్లిగా ఈ గ్యాప్ తగ్గుతూ వచ్చింది. సంక్రాంతికి విడుదల అయిన సినిమా దసరాకి థియేటర్లలోకి వచ్చేది. ఆ తర్వాత సినిమాల ఆయుష్షు 100 రోజుల నుంచి రెండు, మూడు వారాలకు పడిపోయింది. అయినా సంక్రాంతికి రిలీజ్ అయితే, ఉగాదికి వచ్చేవి.. మధ్యలో 3 నెలల గ్యాప్ ఉండడంతో చిన్నాచితకా థియేటర్లలో సినిమా ఆడేది.

Gangs of Godavari Review : విశ్వక్‌ సేన్ మాస్ సంభవం..

ఇప్పుడు ఓటీటీ యుగంలో సంక్రాంతికి వచ్చిన సినిమా, రిప్లబిక్ డేలోపే ఓటీటీలో వచ్చేస్తోంది. థియేటర్‌లో సినిమా ఆయుష్షు 100 రోజుల నుంచి వారానికి పడిపోయింది. ‘కృష్ణమ్మ’ సినిమా రిలీజ్ అయ్యి, వారం కూడా కాకముందే ఓటీటీలో రిలీజ్ అయ్యింది. తాజాగా విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ కూడా ఇదే పంథాలో నడుస్తోంది. మే 31న రిలీజైన ఈ సినిమా, జూన్ 14న ఓటీటీలో వస్తుంది. అంటే థియేటర్‌లో బొమ్మ ఆడేది 15 రోజులే..

ఈ పోకడ చిన్నసినిమాలకే కాదు, పెద్ద సినిమాలకు కూడా పాకింది. మహేష్ బాబు ‘గుంటూర్ కారం’, థియేటర్లలోకి వచ్చిన 26 రోజులకే ఓటీటీలో వచ్చింది. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ ఓటీటీ డీల్‌ రూ.250 కోట్లకు కుదిరింది. సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలో ప్రసారం చేసేందుకు ఈ డీల్‌లో కండీషన్ పెట్టడం వల్ల ఇంత మొత్తం చెల్లించారట. ‘గేమ్ ఛేంజర్’, ‘దేవర’ సినిమాలు కూడా ఈ రకంగానే ఢీల్స్ క్లోజ్ చేశాయి.

Vishwak Sen Gaami : మినిమం గ్యారెంటీ హీరోగా విశ్వక్ సేన్..

ఇంతకుముందు సినిమాకి వెళ్తానని ఇంట్లో అడిగితే మూడు నెలలు ఆగితే టీవీల్లో వస్తుంది కదరా అనే చెప్పేవాళ్లు. ఇప్పుడు రూ.400 పెట్టి సినిమాకి ఎందుకురా దండగ? వారం ఆగితే ఓటీటీలో వచ్చేస్తుందిలే అనే పొజిషన్ వచ్చేసింది..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post