పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ మూవీ రివ్యూ: కసితో తీసిన థ్రిల్లర్..

Mangalavaram Review : ‘RX 100’ మూవీతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు అజయ్ భూపతి. అయితే ఆ మూవీ తర్వాత పాయల్ రాజ్‌పుత్‌ అరడజనుకి పైగా సినిమాలు చేసినా సరైన బ్రేక్ దక్కలేదు. అలాగే అజయ్ భూపతి, సిద్ధార్థ్, శర్వానంద్‌లతో ‘మహాసముద్రం’ చేస్తే అది కాస్తా డిజాస్టర్ అయ్యింది.

ఆఖరి ఆటలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాని చిత్తు చేసి ఫైనల్ చేరిన ఆసీస్..

దీంతో మరోసారి పాయల్ రాజ్‌పుత్, అజయ్ కాంబోలో వచ్చిన మూవీయే ‘మంగళవారం’. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకే సారి విడుదలైంది ‘మంగళవారం’. ట్రైలర్‌తోనే మంచి హైప్ తెచ్చుకున్న ‘మంగళవారం’, ఆ అంచనాలను అందుకోగలిగిందా?

మహాలక్ష్మీపురం అనే గ్రామంలో ప్రతీ మంగళవారం ఓ జంట చనిపోతూ ఉంటుంది. ఆ ఆత్మహత్యల గురించి ఊర్లోని గోడల మీద అక్రమ సంబంధాల గురించి రాతలే కారణమా? నిజంగానే వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? లేక హత్యలా? ఆ గోడల మీద రాతలు రాసే మాస్క్ వ్యక్తి ఎవరు? పాయల్ రాజ్‌పుత్‌కి ఆ చావులకు ఉన్న సంబంధం ఏంటి? ఇదే ‘మంగళవారం’ కథ.

Mangalavaram Review

‘Rx100’ మూవీతో మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ తీసిన అజయ్ భూపతి, ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్‌ని ఎంచుకున్నాడు. ‘Rx100’ మూవీలో ఉన్నట్టే ఇందులో కూడా ప్రేక్షకులకు అందని ట్విస్టులు చాలానే ఉన్నాయి.

‘మహాసముద్రం’ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని కసిగా ‘మంగళవారం’ తీశాడు అజయ్ భూపతి. అజనీశ్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి హైలైట్.

ఎన్టీఆర్ – రాజ్‌కుమార్ మధ్య సీక్రెట్ ఒప్పందం.. ఆ ఒక్క కారణంగానే..

‘Rx100’ తర్వాత పాయల్ రాజ్‌పుత్ మళ్లీ ఆ రేంజ్‌ క్యారెక్టర్ చేసింది. ఈ మూవీ తర్వాత పాయల్ కాస్త సెలక్టివ్‌గా సినిమాలు చేస్తే స్టార్ హీరోయిన్ కావచ్చు. నందితా శ్వేత, విద్య పిల్లయ్, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, చైతన్య కృష్ణ, అజయ్ గోష్‌తో పాటు మాస్క్ పాత్ర వెనకున్న క్యామియో కూడా ఫ్యాన్స్‌ని థ్రిల్‌ అందిస్తాయి. కథ, కథనం, స్క్రీన్ ప్లే‌తో పాటు దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ, మాధవ్ కుమార్ ఎడిటింగ్ వేరే రేంజ్ అనుభూతిని కలిగిస్తాయి.

మొత్తానికి ‘మంగళవారం’ మూవీ థియేటర్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్. సెకండాఫ్, క్లైమాక్స్ ఇంకాస్త వర్కవుట్ చేసి ఉంటే, ఇది టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్‌గా నిలిచి ఉండేది. అడల్ట్ సీన్స్ ఉండడం వల్ల ఫ్యామిలీతో కలిసి చూడడం కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు.

చైయిన్ స్మోకర్ మహేష్, ఆ అలవాటు ఎలా మానేశాడు! ‘గుంటూరు కారం’ కోసం నిజంగానే..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post