Satyabhama Movie Review : కాజల్ అగర్వాల్ ఎమోషనల్ థ్రిల్లర్…

Satyabhama Movie Review : కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సత్యభామ’. నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాని సుమన్ చిక్కల తెరకెక్కించాడు.. పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్ యాక్షన్ సీన్స్‌లో ఇరగదీయడంతో ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి..

హైదరాబాద్‌లో ఏసీపీగా పనిచేసే సత్యభామ, ఓ కేసు విచారణలో చిక్కుల్లో పడుతుంది. ఆ కేసుని ఆమెని ఎలా ఛేదించింది, దాన్ని ఛేదించే క్రమంలో సత్యభామకి ఎదురైన సమస్యలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడింది? సింపుల్‌గా ఇదే ‘సత్యభామ’ సినిమా స్టోరీ. పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌కి కమర్షియల్ హంగులను జోడించి, ఓ సున్నితమైన అంశాన్ని కూడా చర్చించాడు దర్శకుడు సుమన్ చిక్కల..

Tollywood Heros Tags : హీరోలకు ‘స్టార్’ ట్యాగ్‌ల పిచ్చి.. ఆఖరికి శర్వానంద్ కూడా తగిలించుకున్నాడుగా..

ఈ సినిమాకి బలం, బలగం అన్నీ కాజల్ అగర్వాల్. చాలా రోజుల తర్వాత ఓ పవర్ ఫుల్ రోల్ చేసింది కాజల్ అగర్వాల్. హీరో లేకపోయినా సత్యభామకి హీరోగా మారింది. మిగిలిన నటులు తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఫస్టాప్‌లో థ్రిల్లింగ్‌గా సాగే ‘సత్యభామ’ మూవీ, సెకండాఫ్‌లో అక్కడక్కడా కాస్త డల్ అవుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చక్కగా వర్కవుట్ అయ్యాయి. ఇలాంటి సినిమాల్లో క్లైమాక్స్ ఎలా ఉంటుందో జనాలు ముందుగానే ఊహిస్తారు. అయితే దాన్ని థ్రిల్లింగ్‌గా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు..

శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ‘సత్యభామ’ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. విష్ణు బసి సినిమాటోగ్రఫీ, కోడాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాగున్నాయి. కాజల్ అగర్వాల్ గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, పవర్ ఫుల్ పాత్రల్లో కూడా దుమ్ముదులపగలనని నిరూపించుకుంది. ఓ రకంగా ‘సత్యభామ’ మూవీ ఆమెకి సెకండ్ ఇన్నింగ్స్. కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్‌కి, థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా కచ్ఛితంగా నచ్చుతుంది..

https://nammanews.online/maname-movie-review-sharwanand-delivers-another-feel-good-film/

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post