Andhra Pradesh Capital : ఏపీ రాజధాని ఏంటి? ఐదేళ్లుగా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఎన్నో జోకులు పేలాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటో చెప్పండంటూ ఆంధ్రా జనాన్ని వెక్కిరించారు తెలంగాణ వాళ్లు. అయితే ఇక వాటికి ఫుల్ స్టాప్ పడినట్టే. టీడీపీ కూటమి పూర్తి ఆధిక్యంతో వైసీపీని చిత్తు చేసి అధికారం చేజిక్కించుకుంది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి, పోటీ చేసిన ప్రతీ స్థానంలో గెలిచింది. జనసేన, టీడీపీ, బీజేపీ దెబ్బకు వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. జగన్ కాకుండా గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఆ పార్టీలో కొనసాగుతారో చెప్పడం కూడా కష్టం..
Jr NTR : మామయ్యకి, బాబాయికి, అత్తలకు.. తారక్ ఎంత పొడుగు ట్వీట్ వేసినా..
చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి తిరిగి ఏర్పాటు కానుంది. ఐదేళ్లుగా అమరావతిలో ఆగిపోయిన పనులను పూర్తి చేయడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. జూన్ 12న అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నాడు చంద్రబాబు నాయుడు.. దీంతో క్యాపిటల్ సిటీ జోక్స్కి ఫుల్ స్టాప్ పెడుతూ.. ‘నాది ఆంధ్రప్రదేశ్, మ రాజధాని అమరావతి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఆంధ్రా జనాలు..
KA Paul : 22 మంది ఓటేస్తే నాకు 4 ఓట్లు ఎలా వస్తాయి? కేఎల్ పాల్ ఆవేదన..
ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే 2019 నుంచి 2024 వరకూ ఉన్న ఫైల్స్ అన్నీ బయటికి పోకుండా అధికారులతో వాటిని లాక్ చేయించాడు చంద్రబాబు నాయుడు. అలాగే వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ప్రతీకారం తీర్చుకోబోమని చెబుతున్నా, టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ వర్గం గుండెల్లో భయం మొదలైంది. ఈవీఎం పగలగొట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డితో పాటు పోలింగ్ కేంద్రంలో ఓటరును కొట్టిన నాయకులను త్వరలో అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.