Blink Movie : టైమ్ ట్రావెలింగ్ థ్రిల్లర్ ‘బ్లింక్’.. అస్సలు మిస్ కాకండి..

Blink Movie
Blink Movie

Blink Movie : వేరే భాషల్లో హిట్టైన సినిమాలను వెంటనే తెలుగులోకి తెచ్చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అయితే కొన్ని సినిమాలు మాత్రం అక్కడ ఎంత బాగా ఆడినా, తెలుగులోకి అనువాదం కావు. అలాంటి వాటిల్లో కన్నడ సినిమా ‘బ్లింక్’ కూడా ఉంటుంది. 2024, మార్చి 8న కన్నడలో విడుదలైన ‘బ్లింక్’ మూవీ, అక్కడ మంచి సక్సెస్ సాధించింది. ఈ మధ్యకాలంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సైంటిఫిక్ టైమ్ ట్రావెలింగ్ థ్రిల్లర్‌గా గుర్తింపు తెచ్చకుంది. ఇంతకీ ఏముందీ సినిమాలో..

హీరో అపూర్వ, డిగ్రీలో మిగిలిన సబ్జెక్టులను క్లియర్ చేయడానికి తెగ కష్టపడుతూ ఉంటాడు. చిన్న పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, తన ప్రేయసితో కలిసి కొన్ని స్టేజ్ షోలు వేస్తూ ఉంటాడు. ఓసారి అతనికి ఓ మధ్య వయసు వ్యక్తి కనిపిస్తాడు. ఆ తర్వాత అతను చాలాసార్లు కనిపిస్తూ ఉంటాడు. అతను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా తనలా ఉండే మరో వ్యక్తి కూడా కనిపించడం మొదలెడతాడు. తనలా ఉండే మరో వ్యక్తి, తన లవర్‌తో కలిసి వెళ్లడం చూసి షాక్ అవుతాడు. అసలు అతను ఎవరు? తనలా ఎందుకు ఉన్నాడు? ఈ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు..

Tollywood : తెలుగు సినిమాకు ‘టాలీవుడ్’ అనే పేరు ఎలా వచ్చింది..!?

ఈ సమయంలో టైమ్ ట్రావెలింగ్‌ చేయగలిగే ఓ ఐ డ్రాప్స్ గురించి తెలుస్తుంది. ఆ ఐ డ్రాప్స్ కళ్లలో వేసుకోగానే గతంలోకి వెళ్లొచ్చు. అయితే గతంలో కనురెప్పలు ఆడిస్తే మాత్రం మళ్లీ వర్తమానంలోకి వచ్చేస్తారు. అలా తన తండ్రి చనిపోయిన రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి తెగ ప్రయత్నిస్తాడు హీరో… తన తండ్రి ఆత్మహత్యను ఆపడానికి కూడా ట్రై చేస్తాడు. మరి హీరో ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా? అతనికి కనిపించిన ఆ నడి వయసు వ్యక్తి ఎవరు? ఇదే సినిమా కథ. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు థ్రిల్‌ని కలిగిస్తే, క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్ బ్లాక్ అనిపిస్తుంది..

Manisha Koirala : మనీషా కోయిరాలా కెరీర్‌, రజినీకాంత్ వల్లే నాశనమైందా.. 

విజువల్స్, టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్, నటీనటుల యాక్టింగ్ అన్నీ అద్భుతంగా కుదిరి ఈ సినిమాని పర్ఫెక్ట్ టైమ్ ట్రావెలింగ్ థ్రిల్లర్‌గా మార్చాయి. ‘బ్లింక్’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post