Tips For Rainy Season : వేసవి ముగిసింది. తొలకరి చినుకులు మొదలయ్యాయి. అయితే వానలు వస్తూనే వ్యాధులను తీసుకొస్తాయని నిపుణులంటున్నారు. వేసవి తాపం తర్వాత తొలకరి చినుకులు పడడంతో అందరూ ఆనందంతో వర్షంలో తడవాలని ఆశ పడుతుంటారు కానీ వర్షంలో తడిచినా, వర్షపు నీటిలో ఆడుకున్నా అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయినప్పటికీ చాలామంది పిల్లలకి, కొంతమంది పెద్దవాళ్లు వర్షంలో తప్పనిసరై తడుస్తూ ఉంటారు. దీంతో జలుబు, దగ్గు, తలనొప్పి జ్వరం ఇలా ఎన్నో అనారోగ్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కానీ పిల్లలు కానీ వర్షంలో తడిసి ఇంటికి వస్తే.. వెంటనే వేడివేడి నీళ్లతో తల స్నానం చేసేయండి. అలాగే కొంచెం పసుపు, ముద్ద హారతి కర్పూరం, జండూబామ్ వేసి ఆవిరి పట్టండి. తర్వాత కొంచెం మిరియాల రసం లేదా వాము నీళ్లు తాగండి.
Drinking Water : నీళ్లు తాగడం ఒక ఆర్ట్..
ఇలా చేయడం వల్ల ఎలాంటి జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. మీరు తీసుకునే ఆహారంలో విటమిన్స్, ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. డ్రై ఫ్రూట్స్ తరచూ తింటూ ఉండండి. అలాగే వంటల్లో పసుపు, అల్లం ఎక్కువ ఉండేలా చూసుకోండి. వేడి పాలలో పసుపు, మిరియాలు, బెల్లం కలుపుకొని తాగడం మంచిది. చల్లారిన పదార్థాలు కాకుండా వేడివేడిగా తినండి. జంక్ ఫుడ్ కి వీలైనంత దూరంగా ఉండండి.
ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని వ్యాధులు రాకమానవు. డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా, డయేరియా, వైరల్ ఫీవర్ వంటి సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు 1, 2 రోజుల్లో తగ్గకపోతే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
కమ్మనైన కర్ణాటక బిసిబెలే బాత్..
చివరగా.. మీకు తెలిసిందే అనుకోండి.. అయినా చెప్పడం మా బాధ్యత. బైక్ లపై హడావిడిగా వెళ్లే వాళ్ళు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. వర్షాలకు తడిసిన నేల మీద బైక్ టైర్స్ జారీ ప్రమాదాలు జరగవచ్చు. అలాగే రోడ్డుమీద నీళ్లు నిలిచిపోయి ఉండడంతో అది గుంతా లేక రోడ్డో తెలియదు కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళండి. తెలుసుగా మీ కోసం మీ కుటుంబ సభ్యులు వేయి కళ్లతో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు.