SP Balasubrahmanyam : తెలుగు చలన చిత్ర సీమలో ఎవర్గ్రీన్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం.. రికార్డు స్థానంలో కొన్ని వేల పాటలకు తన గొంతును అరువించిన ఎస్పీ బాలు, మరణించిన తర్వాత కూడా సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎస్పీ బాలుకి ఫెవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా?
బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. చిన్నతనం నుంచే బాలు మంచి భోజన ప్రియుడు. బాలుకి కొత్త అవకాయ అంటే భలే ఇష్టం. అలాగే వేయించిన పల్లీలు, పచ్చి కొబ్బరి, స్వీట్లు, ఐస్ క్రీమ్స్, స్వీట్లు అంటే బాగా ఇష్టం. ‘నాకు ఇది నచ్చదు, ఇది నచ్చుతుంది అని ఏమీ ఉండదు. మాంసాహారం తప్ప రుచికరంగా ఉండే ప్రతీ శాకాహారాన్ని నేను ఇష్టంగా తింటాను. అయితే అది నా గొంతుకి హాని చేసేది కాకూడదు. ఆ ఒక్క విషయంలో మాత్రమే నేను జాగ్రత్త తీసుకుంటాను..’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడ ఎస్పీ బాలు..
Ilaiyaraaja : పక్కా కమర్షియల్.. మ్యూజిక్ మాస్ట్రో చేస్తుంది కరెక్టేనా..
కెరీర్ ఆరంభంలో ఎస్పీ బాలుకి సిగరెట్ తాగే అలవాటు ఉండేది. అయితే తన కూతురి కారణంగా ఆ అలవాటుని పూర్తిగా మానేశారు బాలు. 50 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పెళ్లి ఎలా జరిగిందో తెలుసా.. బాలు, సావిత్రిని మొదటి చూపులోనే ప్రేమించాడు. అయితే ఆమె వివాహానికి వాళ్ల ఇంట్లో ఏర్పాట్లు చేస్తున్నారని తెలుసుకున్న బాలసుబ్రహ్మాణ్యం, తన స్నేహితులతో కలిసి బెంగళూరుకి వెళ్లి సావిత్రిని తీసుకొచ్చేశారు. అలా విశాఖపట్నానికి వెళ్లి సింహాచలం ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
తల్లిదండ్రులకు తెలియడంతో రెండేళ్లు వేరు కాపురం ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పెద్దలు, వీరి వివాహాన్ని అంగీకరించి కలిసి పోయారు.