Suriya Kanguva Story : హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పనులు ఆలస్యం కావడంతో వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే ‘ కంగువా’ సినిమా స్టోరీ ఇదేనంటూ ఓ కథ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 16వ శతాబ్దంలో రాజ్యాలను అల్లల్లాడించిన ఓ క్రూరమైన నియంత అయిన చక్రవర్తి, అంతుచిక్కని వ్యాధితో చనిపోతాడు. 1678లో చనిపోయిన అతని మరణానికి గల కారణాన్ని 2024లో ఓ యువతి కనిపెడుతుంది. ఆ యోధుడి అస్థికల ఆనవాళ్ల నుంచి అతన్ని తిరిగి భూమి మీదకి తెస్తుంది..
Tollywood : తెలుగు సినిమాకు ‘టాలీవుడ్’ అనే పేరు ఎలా వచ్చింది..!?
అసలు కంగువా ఎవరు? మళ్లీ తన రాజ్యానికి ఎలా వెళ్లాడు? బతికి ఉన్నప్పుడు తనపై కుట్ర చేసినవారిపై ఎలా పగ తీర్చుకున్నాడనేదే ‘కంగువా’ స్టోరీ లైన్ అని సోషల్ మీడియా టాక్. ఇంచుకుమించుగా కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన ‘బింబిసార’ మూవీ స్టోరీ లైన్ కూడా ఇలాగే ఉంటుంది. అక్కడే ‘బింబిసార’ మూవీలో ఆ కాలానికి, ఈ కాలానికి మధ్య వారథిగా ఓ మాయా దర్పణం ఉంటుంది. ‘కంగువా’ మూవీలో అలాంటిదేమీ ఉండదని అంటున్నారు..
తెలుగులో మంచి సక్సెస్ సాధించిన ‘బింబిసార’ మూవీ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. తెలుగువాళ్లకు తమిళ్ సినిమాలు చూసేందుకు తెగ ఇష్టపడతారు కానీ తమిళులు అలా కాదు. కాబట్టి ‘కంగారు’ స్టోరీ, ‘బింబిసార’ స్టోరీ ఒకటే అయినా తమిళంలో వచ్చిన ఇబ్బందేమీ లేదు. అయితే తెలుగులో వచ్చే కలెక్షన్లపై ఆ ఎఫెక్ట్ కచ్ఛితంగా ఉంటుంది… అసలే సూర్యకి తమిళ్‌లో ఉన్న మార్కెట్ కంటే తెలుగులోనే మార్కెట్ ఎక్కువ. సూర్య నటించిన ‘7th సెన్స్’, ‘24’ వంటి సినిమాలు, తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రాబట్టాయి.