manamey movie :శర్వానంద్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘మహానుభావుడు’ వంటి సినిమాల్లో తన కామెడీతో నవ్వించిన శర్వానంద్, ఈ మధ్యకాలంలో అన్నీ సీరియస్ పాత్రలే చేస్తూ వచ్చాడు. ‘రణరంగం’, ‘జాను’, ‘శ్రీకారం’, ‘మహాసముద్రం’, ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ వంటి వరుస ఫ్లాపుల తర్వాత ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో హిట్టు కొట్టాడు శర్వానంద్. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘మనమే’ మూవీ చేస్తున్నాడు..
ఫస్ట్ లుక్ నుంచి ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. జూన్ 7న థియేటర్లలోకి వస్తున్న ‘మనమే’ సినిమా ట్రైలర్‌ని రామ్ చరణ్ రిలీజ్ చేశాడు. పెళ్లి అయిపోయి, ఓ పిల్లాడు పుట్టినా కూడా లైఫ్‌ని సీరియస్‌గా తీసుకుని ఓ రొమియో కథలా ‘మనమే’ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సినిమాలో ట్విస్టులు ఏమైనా ఉంటాయేమో తెలీదు కానీ ట్రైలర్లో మెయిన్ హైలైట్ మాత్రం శర్వానంద్ కామెడీ టైమింగే..
‘ఉప్పెన’, ‘శ్యాంసింగరాయ్’, ‘బంగార్రాజు’ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వరుసగా నాలుగు ఫ్లాపులు ఫేస్ చేసిన కృతి శెట్టికి ఈ సినిమా విజయం చాలా కీలకం. తమిళంలో 3 సినిమాలు చేస్తున్న కృతి శెట్టికి తెలుగులో మిగిలిన ఒకే ఒక్క సినిమా కూడా ఇదే. ‘మనదే’ సక్సెస్, టాలీవుడ్లో ఆమె కెరీర్‌కి డిసైడర్..
ఈ సినిమాలో ఏకంగా 16 పాటలు ఉంటాయని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. ‘హేషమ్ అబ్దుల్ వాహెబ్ బెస్ట్ వర్క్ ఇది. ఇందులో 16 పాటలు ఉంటాయి. అయితే ఎప్పుడు వస్తాయో ఎప్పుడో అయిపోతాయే కూడా తెలుసుకోలేరు. అలా పరిస్థితికి తగ్గట్టుగా పాటలు వస్తాయి..’ అంటూ చెప్పాడు శ్రీరామ్ ఆదిత్య. ‘భలే మంచి రోజు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ ఆదిత్య, ఆ తర్వాత ‘శామంతకమణి’, ‘దేవదాస్’, ‘హీరో’ వంటి సినిమాలు చేశాడు. ఇందులో మొదటి సినిమా ‘భలే మంచిరోజు’ మాత్రమే కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి.