Manisha Koirala :తెలుగులో ‘క్రిమినల్’, తమిళ్లో ‘బొంబాయి’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’ వంటి సినిమాల్లో నటించిన మనీషా కోయిరాలా, బాలీవుడ్లో చాలా సినిమాలు చేసింది. అయితే సౌత్‌లో ఆమె కెరీర్ అంత సక్సెస్‌ఫుల్‌గా సాగలేదు. 2002లో వచ్చిన ‘బాబా’ సినిమాలో చివరిగా నటించిన మనీషా కోయిరాలా, సౌత్ సినిమాల నుంచి ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. రజినీకాంత్ వల్లే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ఫ్లాప్ అయ్యిందని తెగ బాధపడింది మనీషా కోయిరాలా..
నాగార్జున సరసన ‘క్రిమినల్’ మూవీలో నటించింది మనీషా కోయిరాలా. పేరుకి ఇది తెలుగు సినిమానే అయినా డైరెక్టర్ మహేష్ భట్. బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ తీసిన ఏకైక తెలుగు సినిమా ఇదే. తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి నిర్మించబడిందీ సినిమా. తెలుగులో, హిందీలో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా వంటి ప్రధాన పాత్రలు మాత్రమే సేమ్ ఉంటాయి. మిగిలిన పాత్రల్లో వేరే వేరే నటులు కనిపిస్తారు.
Rajinikanth :రజినీకాంత్‌ని చెప్పుతో కొడతానన్న డైరెక్టర్
క్రిమినల్ తర్వాత మనీషా కోయిరాలాకి టాలీవుడ్ నుంచి చాలా సినిమాల ఆఫర్లు వచ్చాయి. అయితే అప్పట్లో హిందీలో బిజీ హీరోయిన్గా ఉండడంతో తెలుగు సినిమాల ఆఫర్లను రిజెక్ట్ చేసింది మనీషా. తెలుగులో నటించాలంటే డబుల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది. మధ్యలో తమిళ్లో నటించినా అలా చేసిన సినిమాలు కూడా మణిరత్నం, శంకర్ వంటి టాప్ డైరెక్టర్లవే. ఈ సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగు, హిందీలో కూడా రిలీజ్ అయ్యాయి. హిందీలో అవకాశాలు తగ్గుతూ వచ్చాకే తెలుగు, తమిళ్లో అవకాశాల కోసం చూసింది మనీషా కోయిరాలా..
అప్పటికే ఆమె వయసు 30 దాటడంతో సౌత్ హీరోలు, మనీషా కోయిరాలాతో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. రజినీకాంత్ వల్లే తన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కెరీర్ నాశనమైందని మనీషా తెగ ఫీలైపోయినా, అందులో నిజం లేదు. రజినీకాంత్ స్వీయ రచనలో వచ్చిన ‘బాబా’ సినిమాలో హీరోయిన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. శ్రీకాంత్, జగపతిబాబు నటించిన ‘నగరం’ అనే సినిమాలో ఓ స్పెషల్ పాత్రలో కనిపించిన మనీషా కోయిరాలా, సంజయ్ లీలా భన్సాలీ ‘హిరామండి’లో నటించింది.