Rashi,Rangammatta :న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలెట్టిన అనసూయ, ఆ తర్వాత జబర్దస్త్ ప్రోగ్రామ్ యాంకర్‌గా మారింది. అందాలు దాచుకోకుండా డ్రెస్సింగ్ వేసుకుంటూ సినిమా వాళ్ల కళ్లల్లో పడింది.
ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. అనసూయ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ ‘రంగస్థలం’ మూవీలో రంగమ్మత్త క్యారెక్టర్. ఇప్పటికీ చాలా మందిఅనసూయను ముద్దుగా రంగమ్మత్త అని పిలుస్తూ ఉంటారు. అంతలా అనసూయకి గుర్తింపు తెచ్చింది ఈ క్యారెక్టర్..
నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా అనుకున్నది అనసూయని కాదు, హీరోయిన్ రాశిని. అయితే రాశి ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేసింది. హీరోయిన్‌గా తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో నటించిన రాశి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది.
హీరోయిన్‌గా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు మహేష్ బాబు ‘నిజం’ సినిమాలో వ్యాంపు రోల్ లాంటి క్యారెక్టర్ చేసింది రాశి. ‘నిజం’ మూవీలో క్యారెక్టర్, తన కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకుంది రాశి..
దర్శకుడు తేజ కూడా రాశి పాత్ర కూడా చాలా చెప్పాడు. అయితే అలా జరగలేదు. వ్యాంపు పాత్రలో రాశిని చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అప్పటిదాకా వచ్చిన హీరోయిన్ ఛాన్సులు కూడా పోయాయి.
దీంతో ఇకపై అలాంటి క్యారెక్టర్లు చేయకూడదని డిసైడ్ అయ్యిందట రాశి. అందుకే రంగమ్మత్త క్యారెక్టర్‌లో కాస్త బోల్డ్‌గా కనిపించాలని ఉంటుందని చెప్పడంతో నో చెప్పేసిందట రాశి. అలా రాశి నుంచి అనసూయకి వెళ్లింది ఆ క్యారెక్టర్…
అలాగే ముందుగా ‘రంగస్థలం’ మూవీలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ని సెలక్ట్ చేశారు. టెస్టు ఫోటో షూట్ కూడా జరిగింది.
అయితే రామలక్ష్మికి సుకుమార్ అనుకున్న గడుసుతనం, క్యూట్‌గా ఉండే అనుపమలో కనిపించకపోవడంతో ఆ క్యారెక్టర్‌లోకి సమంత వచ్చి చేరింది. అప్పటికే కెరీర్ పీక్‌లో ఉన్న సమంతకి నటిగా మరింత గుర్తింపు తెచ్చింది ‘రంగస్థలం’.
ఈ క్యారెక్టర్ అనుపమ చేసి ఉంటే, ఈపాటికి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయ్యేదేమో..
రామ్ చరణ్‌కి జోడిగా సాయి పల్లవి.. కాంబో సెట్ అయ్యిందా, ఫ్యాన్స్‌కి పూనకాలే!