NTR Food Habits : ఇప్పుడంటే హీరోలు, డైటింగ్, ఫిట్నెస్ పేరుతో కడుపు మార్చుకుంటున్నారు కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణంరాజు వంటి హీరోలు నచ్చిన ఫుడ్డు లాగించేసేవాళ్లు. ఎన్టీ రామారావు అయితే మంచి భోజన ప్రియుడు. నచ్చిన ఫుడ్డుని ఇష్టంగా తినేవాడు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పార్టీ ప్రచారం కోసం ఊరురూ తిరిగారు ఎన్టీ రామారావు. ఈ సమయంలో పెనుమంట్ర అనే గ్రామంలో ఓ అభిమాని, సీనియర్ ఎన్టీఆర్‌కి అభిమానంతో దాదాపు 3 కిలోల జున్ను తెచ్చి ఇచ్చారు.
జున్ను అంటే తెగ ఇష్టపడే ఎన్టీ రామారావు, తనతో పాటు ఉన్న మీడియా ప్రతినిధిని, మొహమాటం కొద్దీ ‘తింటారా’ అని అడిగాడట. అతను వద్దనేసరికి, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 3 కిలోల జున్ను మొత్తం ఒక్కడే లాగించేశాడట. ఈ విషయాన్ని ఆ సమయంలో ఎన్టీఆర్‌తో కలిసి ప్రయాణం చేసిన సదరు మీడియా ప్రతినిధి, తను ప్రచురించిన వార్త కథనంలో రాసుకొచ్చారు. పార్టీ ప్రచార సమయంలో తన వాహనంలో పల్లెపల్లెకి తిరిగి, జనాల సమస్యలు తెలుసుకున్నారు ఎన్టీఆర్.
ప్రజలతో మమేకం కావడం కోసం విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు. బహిరంగంగా రోడ్డు పక్కనే స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం వంటివి చేసేవారు ఎన్టీఆర్. ఈ ఫోటోలను ఈనాడు పత్రికలో ఫ్రంట్ ఫోటోలో ముద్రించేవాళ్లు. ఇలా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తానానికి ఈనాడు సాయం కూడా ఉంది. అందుకే అధికారంలోకి రాగానే రామోజీ ఫిల్మ్ సిటీ కోసం వేల ఎకరాలను నామమాత్రపు రేటుకే రామోజీరావుకి అప్పగించారనే వాదన కూడా ఉంది.
ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తిండి విషయంలో తాతకు తగ్గ మనవడే. టీనేజ్ వయసులో ఓ ఫుల్ బిర్యానీ మొత్తం తానొక్కడినే లాగించేవాడనని స్వయంగా చెప్పాడు ఎన్టీఆర్. అయితే భారీగా బరువు పెరిగిపోవడంతో ఇప్పుడు ఫుడ్డు విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటున్నాడు తారక్. ‘రాఖీ’లో బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ జూనియర్, ‘యమదొంగ’ నుంచి స్లిమ్ లుక్‌ని మెయింటైన్ చేస్తున్నాడు. ‘టెంపర్’ మూవీలో సిక్స్ ప్యాక్ బాడీ కూడా చూపించాడు ఎన్టీఆర్..