Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి 2898AD’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూన్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ‘కల్కి’ మూవీని త్రీడీ ఫార్మాట్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి నితిన్ జిహానీ చౌదరి, ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతను ఎవరో తెలుసా.. బాలీవుడ్లో చిన్న సినిమాగా వచ్చి, సంచలన విజయం అందుకున్న ‘తంబడ్’ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్..
‘తంబడ్’ మూవీ బడ్జెట్ రూ.6 కోట్లు మాత్రమే. బాక్సాఫీస్ దగ్గర రూ.20 కోట్లు వసూలు చేసిన ‘తంబడ్’ మూవీ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డులు దక్కించుకుంది. కథ, కథకు అనుగుణంగా సెట్స్, సినిమా చూసే ప్రేక్షకులను ఓ ఊహాలోకంలోకి తీసుకెళ్తాయి. ఈ సినిమా చూసి తెగ ఇంప్రెస్ అయిన నాగ్ అశ్విన్, ‘కల్కి’ ప్రాజెక్ట్‌లోకి అతన్ని ప్రొడక్షన్ డిజైనర్‌గా తీసుకున్నాడు. ‘కల్కి’ మూవీ బడ్జెట్ ఇప్పటికే రూ.600 కోట్లు దాటేసింది. ప్రమోషన్స్‌తో కలిసి ఇంకో రూ.100 కోట్లు ఈజీగా దాటుతుంది.. ఈ మూవీ తర్వాత నితిన్ చౌదరి పేరు మార్మోగిపోతుందని ఇన్సైడ్ టాక్..
Mahesh Babu – Prabhas : కల్కిలోకి మహేష్ కూడా! అయితే చిన్న ట్విస్ట్..
బుజ్జి పేరుతో ప్రభాస్ నడిపే కారుని పరిచయం చేస్తూ 50 సెకన్ల వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కీర్తి సురేష్, ఆ చిట్టి రొబోకి వాయిస్ ఓవర్ అందించింది. ఈ గ్లిప్స్తో ‘కల్కి 2898AD’ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. హాలీవుడ్ లెవెల్ బొమ్మ రాబోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ మాత్రం పెద్దగా చేయడం లేదు.
‘సలార్’ విషయంలో కూడా ఇలా ప్రభాస్ బ్రాండ్‌ని మాత్రమే నమ్ముకుని సినిమాని వదిలారు. తెలుగులో ప్రభాస్ బ్రాండ్ బాగానే పనిచేసి, భారీ వసూళ్లు వచ్చినా.. బాలీవుడ్లో మాత్రం దెబ్బడిపోయింది. పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సరైన ప్రమోషన్ చేయకపోవడం వల్ల అనుకున్న ఓపెనింగ్స్ దక్కలేదు. మరి ‘కల్కి’ చిత్ర యూనిట్ ఈ విషయాన్ని త్వరగా గ్రహించి, ప్రమోషన్స్ మొదలెడితే బెటర్..