Silk Smitha : ఐటెం సాంగ్ లేదని అమ్ముడుపోని స్టార్ హీరో సినిమా.. చివరికి హీరోకి ఇష్టం లేకపోయినా..

Silk Smitha : హీరోయిన్లకు అభిమానులు ఉంటారు, హీరోలకు వీరాభిమానులు ఉంటారు. అయితే ఐటెం సాంగ్స్, వ్యాంపు పాత్రలు చేసే వాళ్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? ఈ విషయంలో మాత్రం ‘సిల్క్’ స్మిత రేంజే వేరు. 16 ఏళ్ల గ్యాప్‌లో 450 సినిమాలకు పైగా చేసింది సిల్క్ స్మిత. ఇప్పటికీ ఇది ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డు.

ఎన్నో ఏళ్లుగా అమ్ముడుపోకుండా డబ్బాల్లో ములుగుతున్న సినిమాల నిర్మాతలకు సిల్క్ స్మిత ఓ దేవతగా మారింది. పాత సినిమాల్లో సిల్క్ స్మిత పాటను జత చేసి, అమ్మేసేవాళ్లు నిర్మాతలు. ఇలా కేవలం ‘సిల్క్’ మ్యాజిక్ వల్ల గట్టెక్కిన నిర్మాతలు ఎందరో. స్మిత అసలు పేరు విజయలక్ష్మీ వడ్లపట్ల..

ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాలి గ్రామంలో పుట్టిన సిల్క్ స్మిత, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా నాలుగో తరగతిలోనే చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. 10 ఏళ్ల వయసులో చదువు మానేసిన సిల్క్ స్మితకి 14 ఏళ్ల వయసులో పెళ్లైంది. అయితే భర్త వేధింపులు తట్టుకోలేక ఇళ్లు వదిలి వచ్చేసిన విజయలక్ష్మీ, చెన్నైలో సిల్క్ స్మితగా స్టార్ స్టేటస్ అనుభవించింది.

Samantha, Savitri, Silk Smitha : వాడుకుని వదిలేస్తుందా ఫిల్మ్ ఇండస్ట్రీ..!?

ఏవీఎం స్టూడియోస్ దగ్గరున్న ఓ పిండి గిర్నీకి వచ్చిన సిల్క్ స్మితను చూసిన దర్శకుడు విను చక్రవర్తి… ఆమె అందానికి ముగ్దుడైపోయి, సినిమాలో అవకాశం ఇచ్చాడు. అలా మలయాళంలో 1981లో ‘ఇనయే తేడి’ అనే సినిమాలో నటించిన స్మిత, ‘వండిచక్రం’ అనే సినిమాతో ‘సిల్క్ స్మిత’గా మారింది.

సిల్క్ స్మిత 4 నిమిషాలు తెర మీద కనిపిస్తే చాలు, ఆ పాట చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడేవారు. దీన్ని క్యాష్ చేసుకున్న చాలా మంది నిర్మాతలు, ఎన్నో ఏళ్లుగా విడుదల కాకుండా డబ్బాల్లో మూలుగుతున్న సినిమాలకు స్మిత పాటను జోడించి, రిలీజ్ చేయడం మొదలెట్టారు. ఇది డిస్టిబ్యూటర్లకు కాసుల పంట పండించింది.

ఈ క్రేజ్ ఏ స్థాయికి వెళ్లిందంటే తమిళనాడులో స్టార్‌ హీరోగా మారిన స్మిత ఐటెం సాంగ్ లేదని శివాజీ గణేశన్ నటించిన సినిమాని కూడా కొనడానికి డిస్టిబ్యూటర్లు ముందుకు రాలేదు. శివాజీ గణేశన్, అంబికా ముఖ్యపాత్రల్లో ‘వాజ్‌కాయ్’ అనే సినిమా రూపొందింది. కుటుంబ కథా మూవీగా రూపొందిన ఈ సినిమాలో ముందుగా ఐటెం సాంగ్ అనుకోలేదు.

అయితే ప్రివ్యూ చూసిన డిస్టిబ్యూటర్లు, సిల్క్ స్మిత పాట లేకపోతే జనాలు థియేటర్‌కి రావడం లేదని, ఈ సినిమాని కొనలేమని చెప్పేశారు. దీంతో హీరో శివాజీ గణేశన్‌కి ఇష్టం లేకపోయినా, సిల్క్ స్మితతో ఓ ఐటెం సాంగ్ చేయించింది సినిమా యూనిట్. అలా విడుదలైన ఈ సినిమా, 100 రోజులు ఆడేసింది.. అలా యాక్షన్ సినిమాలే కాదు, కుటుంబ కథా చిత్రాలకు కూడా ఆక్సిజన్‌లా మారిన సిల్క్, కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకుంది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post