Pawan Kalyan Remake : పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో బిజీ అయ్యాక స్ట్రైయిక్ సినిమాల కంటే ఎక్కువగా రీమేక్‌లే చేస్తూ వస్తున్నాడు. అప్పుడెప్పుడో క్రిష్ దర్శకత్వంలో మొదలైన ‘హరిహర వీరమల్లు’ పూర్తి కాకముందే మధ్యలో ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ ఇలా మూడు రీమేక్‌లు రిలీజ్ అయ్యాయి.
ఈ మూడు సినిమాలు కూడా భయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టలేకపోయాయి. క్రిష్ తర్వాత పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ సినిమాకి ఒప్పించిన డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో తెరకెక్కిన ‘ They Call Him OG’ మూవీ, సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది..
ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిప్స్, టీజర్ దగ్గర్నుంచి ఈ సినిమాపై హైప్స్ ఆకాశాన్ని తాకాయి. నిజానికి సుజిత్‌తో ఓ రీమేక్ సినిమా చేయించాలని పిలిపించాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ‘నేను పవన్ కళ్యాణ్‌తో ఓ లవ్ స్టోరీ తీయాలని అనుకున్నాను. నిజానికి నన్ను, ఓ రీమేక్ తీయడానికి పిలిపించారు.
Pawan Kalyan : గెలిచినా, ఓడినా ఆయనెప్పుడూ పవర్ స్టారే!
ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒరిజినల్ సినిమా తీస్తానని అన్నాను. అలా నేను చెప్పిన లైన్, ఆయనకి నచ్చి డెవలప్ చేయమన్నారు. అలా వచ్చిందే OG. ఓజాస్ అంటే గురువు, మాస్టర్ అని.. గంభీర అనేది పవన్ కళ్యాణ్ గారి పేరు.. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ నుంచి ఏమైతే ఆశిస్తారో అవన్నీ ఇందులో ఉంటాయి.
ఓ ఫ్యాన్‌గా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నానో అలాగే OG మూవీలో ఆయన క్యారెక్టర్ ఉంటుంది..’ అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు సుజిత్..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సుజిత్ కాంబినేషన్‌లో విజయ్ ‘తేరీ’ రీమేక్ తెరకెక్కబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. అయతే ‘తేరీ’, తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో రిలీజ్ అయ్యి, మంచి విజయం అందుకుంది.
అంతకుముందు తెలుగులో ‘వీరుడొక్కడే’ పేరుతో డబ్ అయి, రిలీజ్ అయిన అజిత్ ‘వీరం’ సినిమాని పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేసి, ఫ్లాప్ ఫేస్ చేశాడు.