Prabhas – Prashanth Neel : ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ డిజాస్టర్ల తర్వాత ప్రభాస్‌కి కాస్త ఊరట ఇచ్చిన చిత్రం ‘సలార్’. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, వరల్డ్ వైడ్ రూ.740 కోట్లకు పైగా రాబట్టింది. తెలంగాణ, కర్ణాటక ఏరియాల్లో లాభాలు తెచ్చిపెట్టిన ‘సలార్’, హిందీలోనూ బ్రేక్ ఈవెన్ సాధించింది. అయితే భారీ ధరకు రైట్స్ విక్రయించడంతో పాటు సినిమా కథ, కథనాలు మాస్ ఆడియెన్స్‌కి ఎక్కకపోవడంతో ఆంధ్రా, నార్త్ అమెరికా ఏరియాల్లో ‘సలార్’ సినిమాకి నష్టాలు తప్పలేదు. అలాగే బాలీవుడ్లో ‘డంకీ’ సినిమాతో కలిసి రిలీజ్ కావడం అక్కడ కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపించింది.
Prabhas Salaar : ‘బాహుబలి’ మూవీని దాటేసిన ‘సలార్’.. మిగిలింది ఆ రెండే..
‘సలార్ పార్ట్ 1’ మూవీలో సగం కథే చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అసలు కథ, ‘సలార్ 2’లోనే ఉండనుంది. అయితే ‘సలార్ 1’ రిలీజ్ అయ్యి, 6 నెలలు దాటుతున్నా ఇంకా పార్ట్ 2 షూటింగ్ మొదలుకాలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌తో సినిమా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆగస్టు నుంచి ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది..
మరోవైపు ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘కల్కి 2898AD’ మూవీ షూటింగ్‌ని పూర్తి చేసిన ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు ‘కల్కి 3102BC’ సినిమా ఉంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఇంకో సినిమా ఉంది. ఇన్ని సినిమాల మధ్య ‘సలార్ 2’ మూవీ ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ (Prabhas,Prashanth Neel)మధ్య క్రియేటివ్ డిఫరెన్సులు రావడంతో ‘సలార్ 2’ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించింది చిత్ర యూనిట్. ‘నవ్వు ఆపుకోలేకపోతున్నాం’ అంటూ రియాక్ట్ అయ్యింది చిత్ర యూనిట్..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ఏడాది డిసెంబర్‌లోపు షూటింగ్ ముగించి, ప్రభాస్ ‘సలార్ 2’ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.