Ilaiyaraaja : ఇళయరాజా, దాదాపు 3 దశాబ్దాల పాటు సౌత్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఎన్నో క్లాసిక్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన ఇళయరాజా, ఇప్పుడు పక్కా కమర్షియల్. తాజాగా మలయాళ ఇండస్ట్రీ హిట్ ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీలో ‘గుణ’ సినిమా పాటను వాడినందుకు వారికి లీగల్ నోటీసులు పంపించాడు ఇళయరాజా.
ఇంతకుముందు రజినీకాంత్ ‘వెట్టెయన్’ మూవీ గ్లిప్స్‌లో ఇళయరాజా మ్యూజిక్ బిట్ వాడినందుకు కూడా వారికి నోటీసులు వెళ్లాయి. అయితే ఇది ఇప్పుడు మొదలైన పంచాయితీ కాదు. తాను స్వరపరిచిన పాటలను అనుమతి లేకుండా ‘పాడుతా తీయగా’ వంటి ప్రోగ్రామ్స్‌లో పాడుతున్నాడని ఎస్పీ బాలుకి లీగల్ నోటీసులు పంపాడు ఇళయరాజా.. అయితే ఆ గొడవ తెగలకముందు బాలు అనారోగ్యంతో మరణించారు..
Bollywood Powerhouse RGV :బాలీవుడ్‌ని ఏలింది ఓ తెలుగోడు! ఆర్జీవీ వల్లే ఈ పొజిషన్లో ఉన్నాం..
అయితే ఇళయరాజా చేస్తుంది నిజంగా తప్పేనా? నిజానికి చాలా సినిమాల్లో ఇళయరాజా స్వరం అందించిన పాటలను చిన్న చిన్న బిట్స్‌గా వాడేవాళ్లు. ‘గబ్బర్ సింగ్’, ‘రామయ్య వస్తావయ్యా’ వంటి సినిమాల్లో కూడా సందర్భాన్ని బట్టి, ఇళయరాజ సాంగ్స్ వాడారు. ఇప్పుడు ఇళయరాజా కాపీ రైట్స్ కారణంగా వాటిని వాడుకోలేని పరిస్థితి..
అంతెందుకు దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాలో హీరో ఫ్రెండ్ కాలర్ ట్యూన్ కానీ, మొబైల్లో పెట్టే పాటలు కానీ వినిపించవు. ఎందుకంటే అవి కూడా ఇళయరాజా పాటలే. నాని హీరోగా వచ్చిన ‘ నిన్ను కోరి’ మూవీలో హీరోయిన్ పల్లవి. సందర్భాన్ని తగ్గట్టుగా ‘పల్లవించగా నా గొంతులో’ సాంగ్ వింటూ ఉంటాడు హీరో. అయితే ఇళయరాజా కాపీ రైట్స్ వేయడంతో ఆ ప్లేస్‌లో ఏదో కొత్త సాంగ్ స్వరపరిచి జోడించాల్సి వచ్చింది..
ఇలా ఇళయరాజా కారణం ఎన్నో పాటలు, సందర్భాలు మారిపోయాయి. అయితే ఇళయరాజా చేస్తుంది పూర్తిగా తప్పని అనలేం. ఎందుకంటే ఓ పాట రిలీజ్ అయితే దాన్ని సీరియల్స్‌లో విరివిరిగా వాడేసేవాళ్లు. ‘బాహుబలి’ మూవీలో ‘మాహీష్మతి’ సాంగ్, రిలీజైన వారానికే ఓ సీరియల్లో హీరో ఎలివేషన్స్‌కి వాడేశారు ఆ సీరియల్ మేకర్స్. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘తులసీదళం’ మూవీలో ఓ పాట, రిలీజ్ కాకముందే సీరియల్లో రావడం చూసి షాక్ అయ్యాడు. ఇలాంటివి నిలువరించడానికి ఇళయరాజా చేస్తుంది కరెక్టే..
ఎప్పుడో మరిచిపోయిన ఇళయరాజా పాటలను బయటికి తీసి, వాటికి మళ్లీ పాపులారిటీ తెస్తున్నారు ‘మంజుమ్మల్ బాయ్స్’ వంటి సినిమా మేకర్స్.. ఇలాంటి సినిమాల వల్ల ఇళయరాజాకి లాభమే తప్ప, నష్టం ఉండదు. అయినా కూడా ఇలా అనుమతి తీసుకోవాలి, కాపీరైట్స్ చెల్లించాలని కోరడం ఎంతవరకూ కరెక్ట్ అంటున్నారు మ్యూజిక్ లవర్స్..