Janhvi Kapoor : జాతకాలు సెట్ అయితేనే ఫ్రెండ్‌షిప్, లేదంటే కటీఫ్..

Janhvi Kapoor : జాతకాలు, జ్యోతిషం వంటివి కూడా సైన్స్‌లో భాగంగానే చూస్తారు కొందరు. మరికొందరు మాత్రం వీటిని మూఢనమ్మకాలుగా తీసి పడేస్తారు. సైంటిస్టుల కంటే కూడా వేణు స్వామి వంటి దొంగ స్వాములకే ఇక్కడ పాపులారిటీ ఎక్కువ. టాలీవుడ్ హీరోయిన్లు చాలామంది వేణు స్వామి దగ్గర పూజలు, హోమాలు చేస్తూ కనిపించారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్  కూడా ఇదే బాపతు అంట..

‘నాకు జాతకాలంటే పిచ్చి. నా రాశి ఫలాలను రోజూ చెక్ చేసుకుంటూ ఉంటాను. అంతే కాదు, నా రాశికి అనుకూలంగా ఉండే వారితోనే నేను స్నేహం చేస్తాను. ఓసారి నా రాశికి సెట్ కావడం లేదనే ఒకే ఒక్క కారణంగా ఓ ఫ్రెండ్‌తో ఫ్రెండ్‌షిప్ కట్ చేసుకున్నాను… నేను జాతకాలను అంతగా నమ్ముతాను.. అవి బాగుంటే, అన్నీ బాగుంటాయని విశ్వసిస్తున్నా.. ఇప్పటిదాకా అలాగే జరుగుతూ వస్తోంది..’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్..

Vijay Deverakonda – Sai Pallavi : విజయ్ తో సాయి పల్లవి! అప్పుడు మిస్ అయ్యింది కానీ..

అయితే తన తల్లి శ్రీదేవి ఆకస్మిక మరణం గురించి ఏ జాతకంలో తెలియలేదా? ఏ జ్యోతిషుడు చెప్పలేదా? అని జాన్వీ కపూర్‌ని ప్రశ్నలతో నిలదీస్తున్నారు అతిలోక సుందరి అభిమానులు. బాలీవుడ్ సినిమాలతో తెగ బిజీగా ఉన్న జాన్వీ కపూర్, తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీలో నటిస్తోంది. అలాగే రామ్ చరణ్- బుచ్చిబాబు సన కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. ‘గేమ్ ఛేంజర్’ మూవీ తర్వాత ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తాడు రామ్ చరణ్..

 

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post