Thammudu Movie Story : హీరోయిన్ లయ రీఎంట్రీ.. స్టోరీ ఇదేనా..!?

Thammudu Movie Story : తెలుగు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో కాస్తో కూస్తో బిజీగా సినిమాలు చేసిన ఆఖరి తెలుగు అమ్మాయి లయ. వేణుతో ‘స్వయంకృషి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన లయ, జగపతి బాబు, వడ్డే నవీన్, రాజశేఖర్, శ్రీకాంత్, మోహన్ బాబు, బాలకృష్ణ సినిమాల్లో నటించింది. 2006లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న టైమ్‌లోనే పెళ్లి చేసుకుని, విదేశాల్లో సెటిల్ అయిపోయింది లయ.. శ్రీను వైట్ల, రవితేజ, ఇలియానా కాంబినేషన్‌లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో ఓ చిన్న రోల్ చేసిన లయ, టాలీవుడ్ లో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది..

నితిన్ హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో ‘తమ్ముడు’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ‘కాంతర’ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్లిన ‘తమ్ముడు’ మూవీలో నితిన్‌కి అక్కగా లయ నటిస్తోందట. ఇంతకుముందు వేణు శ్రీరాం దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ (MCA) మూవీలో భూమిక, వదిన పాత్రలో నటించింది. వదినను, విలన్ల నుంచి కాపాడే మిడిల్ క్లాస్ అబ్బాయి కథ, కమర్షియల్‌గా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది..

Pushpa2 shocking update : ఓటీటీలోకి ‘పుష్ప 2’… 

ఇప్పుడు వదిన పాత్రను అక్కగా మార్చి, ‘తమ్ముడు’ మూవీ తీస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. నాగచైతన్య ‘సవ్యసాచి’, నాగశౌర్య ‘అశ్వథ్థామ’ వంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. ఇప్పటికే నితిన్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ‘భీష్మ’ తర్వాత ‘చెక్’, ‘రంగ్‌దే’, ‘మాచర్ల నియోజికవర్గం’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఒక్కదాన్ని మించి ఒకటి డిజాస్టర్‌గా నిలిచాయి. నితిన్‌కి ఇప్పుడు ఓ కమర్షియల్ సక్సెస్ చాలా చాలా అవసరం..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post